ఎన్టీఆర్: మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఈ కళాశాలలో 350 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కళాశాల యాజమాన్యం వారు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
Locations: Krishna
-
సీల్డ్ తొలగింపు కార్యక్రమం చేపట్టిన అధికారులు
కృష్ణా: పెడన పట్టణంలో పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై నిలిచిన నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో పూడుకుపోయిన డ్రైనేజీలను శుభ్రపరుస్తూ, సీల్డ్ తొలగింపు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు.
-
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రయాణికుల బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పాపం.. భార్యను బెదిరించబోయి ప్రాణాలు కోల్పొయాడు!
ఎన్టీఆర్: ఆత్మహత్య చేసుకుంటానని భార్యను బెదిరించబోయి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోయి ఓవ్యక్తి మృతిచెందిన విషాదఘటన విజయవాడలో జరిగింది. ముస్తాబాద్ ప్రాంతానికి చెందిన ఉయ్యూరు రంగారావు(28) రామానగర్ ప్రాంతానికి చెందిన మహిళతో కొన్నేళ్లక్రితం వివాహమైంది. రంగారావు తన భార్యను వేధించడంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. ఈక్రమంలో మద్యం తాగి అపార్ట్‌మెంట్ ఎక్కి కిందికి దూకేస్తానని బెదిరించాడు. ప్రమాదవశాత్తూ కింద పడి మృతిచెందాడు.
-
‘మిస్ తెలుగు అమెరికా’ పోటీల్లో విజేతగా పెడన యువతి
దక్షిణ అమెరికా తెలుగు సొసైటీ ఇటీవల నిర్వహించిన ‘మిస్ తెలుగు అమెరికా’ పోటీల్లో పెడన యువతి విజేతగా నిలిచారు. కృష్ణాజిల్లా పెడనకు చెందిన భవిరిశెట్టి ఆనందరావు, పావని దంపతుల కుమార్తె నిహారిక న్యూయార్క్‌లోని లాంగ్ఐలాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. ఇటీవల నిర్వహించిన మిస్ తెలుగు అమెరికా పోటీల్లో నిహారిక విజేతగా నిలిచారని అభిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సత్యనారాయణ తెలిపారు.
-
హైవేపై రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు జాతీయ రహదారి(165) పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌కు, ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
-
ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా గుంటూరు వాసి
గుంటూరు జిల్లా తుమ్మపూడికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్(ఈఏసీ-పీఎం)గా నియమితులయ్యారు. ఆయన గురువారం మెయిల్ ద్వారా ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న మహేంద్రదేవ్.. గతంలో ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చి సంస్థ డైరెక్టర్‌గా(ఉప కులపతి), కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. -
భిన్న వాతావరణం.. కొన్నిచోట్ల ఎండ.. మరికొన్న చోట్ల వాన
రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో గరిష్టంగా 39-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే అల్లూరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
నేడు పవర్ కట్.. ఎక్కడంటే?
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసరగ్రామ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ తెలిపారు. 33/11 కేవీ కీసర సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కెవి కీసర ఫీడర్ మీద చెట్లకొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 7గంటల నుంచి 11.30గంటలవరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
-
ఆయా జిల్లాల్లో ఉక్కపోత.. వర్షాలు
గుంటూరు: విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో శుక్రవారం ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.