ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలో ‘పొలం పిలుస్తోంది’ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట నమోదు అవశ్యకత, PM-PRANAMలో భాగంగా రైతులకు ఎరువుల వినియోగం తగ్గించి నానో యూరియా,నానో DAP, జీవన ఎరువుల వాడకం గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన సంస్థ గరికపాడు నుంచి రాజశేఖర్, జిల్లా వనరుల కేంద్రం DDA వెంకటేశ్వరావు, మండల వ్యవసాయ ఆధికరి విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
అన్ని వర్గాల సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే
కృష్ణా: కుల మత వర్గాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగులూరు, చంద్రాల గ్రామాల్లో ఎమ్మెల్యే రాము బుధవారం ఉదయం విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగులూరు పీఎసీఎస్ త్రీ మెన్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొని, అనంతరం నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.
-
ఉద్యాన పంటలతో రైతుల ఇంట సిరులు: కలెక్టర్
ఎన్టీఆర్: ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉచితంగా పండ్ల, పూల మొక్కల సాగును చేపట్టవచ్చని, ఉద్యాన పంటలతో రైతులకు సుస్థిర ఆదాయాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. చందర్లపాడు మండలం, ముప్పాళ్ల గ్రామ రైతు నాగేశ్వరరావు ఉపాధి హామీ పథకం కింద ఎకరా విస్తీర్ణంలో వేసిన తైవాన్ జామ తోటను కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు.
-
మాజీ మంత్రితో వెంకటతర్నం భేటీ
ఎన్టీఆర్: కంచికచర్ల పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ గుత్తా వీర వెంకటరత్నం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా వెంకటరత్నానికి దుశ్శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ రైతుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి ఒక మంచి అవకాశం కల్పించింది.
-
ప్రజలందరి సంక్షేమమే కూటమి లక్ష్యం: వెనిగండ్ల
కృష్ణా: కుల, మతాలకతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగులూరు, చంద్రాల గ్రామాల్లో ఎమ్మెల్యే రాము బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగులూరు పీఏసీఎస్ త్రీమెన్ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ..నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. రామాలయ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు.
-
గణేషుడికి MDO పూజలు
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల MDO బీఎం లక్ష్మి కుమారి పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు కాకాణి సుమన్ పాల్గొన్నారు.
-
ఆ ఘనత పవన్‌కళ్యాన్‌కే దక్కింది: మండలి
కృష్ణా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గెలుపే లక్ష్యంగా కూటమి నాయకులు ఐక్యత చూపాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి మోపిదేవి మండలం కె.కొత్తపాలెంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న డోలి కష్టాలు తప్పించి, రోడ్లు వేయించిన ఘనత పవన్‌కళ్యాన్‌కే దక్కిందన్నారు.
-
యూరియా.. మోదుమూడిలో సరఫరా
కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడిలో రైతులకు యూరియా సరఫరా చేశారు. బుధవారం గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ధ ఇరవై టన్నుల యూరియాను క్రమపద్ధతిలో విక్రయించారు. కార్యక్రమంలో అవనిగడ్డ పీఏసీఎస్ ఛైర్మన్ మాదివాడ రత్నారావు(రత్తయ్య), జనసేన పట్టణ సీనియర్ నాయకులు వెంకట్‌నాథ్ ప్రసాద్, కోడూరు డీసీ వైస్ ఛైర్మన్ రఘునాథ ప్రసాద్, అగ్రికల్చర్ అసిస్టెంట్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
-
యూరిత కోసం క్యూలు
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కోడూరు , నాగాయలంక, మోపిదేవి మండలాల్లో ఉదయం ఆరు గంటల నుంచి సహాకార సంఘాల వద్ధ యూరియా కోసం రైతులు క్యూలు కట్టారు. కొన్ని బ్యాంకుల వద్ద రాత్రికి రాత్రే యూరియా మాయమైందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
-
నందిగామలో రూ.3.10 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ
AP : NTR జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్ గణపతి మండపంలో వినాయకుడిని రూ.3.10 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. కమిటీ 43వ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకొని కరెన్సీ నోట్లతో మండపం, విగ్రహాన్ని అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.