Locations: Krishna

  • మొక్కలు నాటి పర్యావరణం రక్షించుకుందాం: బీఎస్ భార్గవ్

    ఎన్టీఆర్: మొక్కలు నాటి పర్యావరణం రక్షించుకుందామని ప్రపంచ పర్యావరణ సంస్థ(WEO) ఏపీ అధ్యక్షుడు బీఎస్ భార్గవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని సత్య సాయిశ్రీ వృద్ధాశ్రమంలో భార్గర్ మొక్కలు పంపిణీ చేశారు. వృద్ధులతో కలిసి పర్యావరణంపై స్థానికులకు అవగహన కల్పించారు. ఏపీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలనే అంశంపై ఈరోజు సాయంత్రం 5గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ నిర్వహించనున్నామన్నారు.

  • పనులు ఆలస్యమైతే.. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేస్తా: MLA

    కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలో రైతులకు మేలు చేసేందుకు అధికారులు, నీటి సంఘాలు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాలువల అభివృద్ధి పనులపై సమీక్షించి, అధికారుల వివరణతో సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై హెచ్చరించిన రాము, పనులు ఆలస్యమైతే బ్లాక్ లిస్ట్ చేస్తామని తెలిపారు.

     

     

  • ‘పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గం’

    ఎన్టీఆర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవం-2025 సందర్భంగా గురువారం నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ బాలకృష్ణ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని, ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదాం అని, స్వచ్ఛ హరితంద్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేదామన్నారు.

     

  • జిల్లా కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌‌కు సత్కారం

    ఎన్టీఆర్: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం మాజీ మంత్ర, జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ నేతలతో ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కలిసి రఘురాంని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

     

  • లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరైన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: విజయవాడ కండ్రికలోని ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కేంద్రంలో గురువారం ఆంధ్రప్రదేశ్ లా కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు.

  • రాజ్యాధికారం లక్ష్యంగా అడుగులు వేయండి: దేవీ ప్రసాద్ పిలుపు

    ఎన్టీఆర్: ఎస్సీ, బీసీ, మైనారీటీ సోదరులు రాజ్యాధికారం లక్ష్యంగా అడుగులు వేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం విజయవాడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘంటసాల మండలానికి చెందిన పలువురు దేవీ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. RPI బలోపేతానికి కృషి చేయాలని దేవీప్రసాద్ కోరారు.

  • పర్యవరణంతో మానవ మనుగడ: కాగిత

    కృష్ణా: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెడన మండలం నందమూరులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణం పరిరక్షణతో మానవ మనుగడ సాగుతుందన్నారు. ప్రతి ఇంటిలోనూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘పర్యావరణంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’

    ఏలూరు: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ కైకలూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణంలో మొక్కలు, వృక్షాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఈమేరకు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యవంతంగా జీవిద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

     

  • పర్యావరణ పరిరక్షణ..భావితరాలకు భవిష్యత్‌: మంత్రి

    కృష్ణా: పెనమలూరులో నేడు మంత్రి సవిత పర్యటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పోరంకిలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..‘సీఎం చంద్రబాబు పిలుపుమేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నాం. మొక్కలు నాటడమే కాదు, వాటిని రక్షించే బాధ్యత అందరిపై ఉంది. గతంలో జగన్ మొక్కలు నరికించేవాడు. సీఎం చంద్రబాబు పర్యావరణాన్ని కాపాడుతూ భావితరాలకు భవిష్యత్‌ను అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

  • KDCCB ఛైర్మన్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

    ఎన్టీఆర్: కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన నెట్టెం రఘురాంకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని కృష్ణా డీసీసీబి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయవాడలో రఘురాంను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.