Locations: Krishna

  • ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్

    • నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి
    • విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కేసు సుఖాంతం
    • దోనబండ వద్ద లారీ భీభత్సం.. తృటిలో తప్పిన ప్రమాదం
    • మసులా బీచ్ ఫెస్టివల్‌లో హెలీ రైడ్స్ ప్రారంభం

  • ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

    ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ ఆటోను కారు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ప్రజల సహచరుడిగా ఉంటా: MLA

    కృష్ణా: గుడివాడ సహచరుడిగా ఉంటూ ప్రజలకు మంచి చేయడంలోనే నాకు సంతోషమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజలు అర్జీలు అందించేందుకు పోటెత్తారు. అత్యధిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజా వేదిక కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రజల సహచరుడిగా సమస్యలు తీర్చడంలో సంతోషం ఉందని ఎమ్మెల్యే రాము తెలిపారు.

     

  • ‘పేదలకు అండగా సీఎం సహాయనిధి’

    కృష్ణా: పేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పెడన నియోజకవర్గంలోని పలువురు పేదలకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) తోటమూల టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

  • ‘బీసీలకు అన్యాయం చేస్తున్నారు’

    కృష్ణా: విశ్వవిద్యాలయ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానాన్ని పాటించకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు నూటికి 25శాతంతో పాటు జనరల్ కోటాలో మరికొన్ని ఉద్యోగాలు రోస్టర్ విధానాన్ని అమలు పరచడం ద్వారా ఇవ్వాలన్నారు. రోస్టర్ విధానాన్ని పక్కాగా అమలు పరచకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

  • వైసీపీ గుడివాడ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడిగా అడబాల

    కృష్ణా: వైసీపీ గుడివాడ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడిగా సీనియర్ వైసీపీ నాయకులు అడబాల అప్పారావు నియమితులయ్యారు. అధ్యక్షుడిగా నియమితులైన అప్పారావును భాస్కర్ థియేటర్ వద్ద గల ఆయన కార్యాలయంలో వైసీపీ నేతలు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • ‘రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి’

    కృష్ణా: రాజకీయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పెంచి లింగ సమానత్వం సాధించటం సాధ్యమవుతుందని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. కొడాలి మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తోట కనకదుర్గ నివాసానికి వెళ్లిన సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి ఆమెను అభినందించారు.

  • గండ్లు పూడికతీత పనులను పరిశీలించిన కలెక్టర్

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలంలోని పులివాగు, నర్సాయి గూడెం వద్ద జరుగుతున్న గండ్లు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ లక్ష్మి శతో కలిసి మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

  • సీ కయాకింగ్‌ పోటీలను ప్రారంభించిన మంత్రి

    కృష్ణా: మచిలీపట్నంలో మసులా బీచ్‌ ఫెస్టివల్‌ రెండో రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా 3వ జాతీయ స్థాయి సీ కయాకింగ్‌ పోటీలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న సీ కయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. 3 రోజులపాటు జరగనున్న ఈ పోటీలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

  • చెన్నకేశవస్వామి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

    కృష్ణా: గూడూరు మండలం తరకటూరు గ్రామంలో శ్రీభూ సమేత స్వయంభూ చెన్నకేశవస్వామి ఆలయం ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వారి సతీమణి కాగిత శిరీష స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.