ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసరగ్రామ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ తెలిపారు. 33/11 కేవీ కీసర సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కెవి కీసర ఫీడర్ మీద చెట్లకొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా శుక్రవారం ఉదయం 7గంటల నుంచి 11.30గంటలవరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Locations: Krishna
-
ఆయా జిల్లాల్లో ఉక్కపోత.. వర్షాలు
గుంటూరు: విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో శుక్రవారం ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
-
ఫోటో తీసి పంపిస్తే రూ.500 బహుమతి
ఎన్టీఆర్: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో చెత్త హెచ్చరిక బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డు ఉన్న ప్రాంతంలో ఎవరైనా చెత్త, ఇతర వ్యర్ధాలు వేస్తే ఫోటో తీసి గ్రామపంచాయతీకి సమర్పించిన వారికి రూ.500 బహుమతి ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు ఎవరూ కూడా ఈప్రాంతంలో చెత్తను వేయటం జరగలేదని స్థానికులు అన్నారు. అధికారుల ఆలోచన సఫలీకృతమయిందని స్థానికులన్నారు.
-
ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు అభినందన సభ
ఎన్టీఆర్: విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆలపాటి సురేష్‌కి గురువారం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్‌లో అభినందన సభ జరిగింది. కార్యక్రమంలో ఎపీయుడబ్లూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ.సుబ్బారావు, అమరావతి ఉద్యమకారులు బాలకోటయ్య, విశ్రాంత ఐజీ ఏబీ.వేంకటేశ్వరావు, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సలహాదారు షరీఫ్ అహమ్మద్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్రప్రభుత్వ మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ,తదితరులు పాల్గొన్నారు.
-
ఘనంగా మసులా బీచ్ ఫెస్టివల్ ప్రారంభం
కృష్ణా: మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైన్స్&ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఫెస్టివల్‌ను ప్రారంభించారు. గేట్ వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్, 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జ్యోతిప్రజ్వలన చేశారు. నాలుగు రోజులు జరిగే ఈ ఫెస్టివల్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
-
కరెంట్ షాక్‌కు గురైన కార్మికుడు
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు సాయి నగర్‌లో కార్మికుడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ శాఖ ఆర్.డీ.యస్.యస్ స్కీం పనుల సందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు బీర్ సింగ్ కరెంట్ షాక్ తగిలిందని పలువురు ఆరోపిస్తున్నారు. బాధితుడిని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకి తరలించారు.
-
ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్
- పర్యావరణ పరిరక్షణ..భావితరాలకు భవిష్యత్: మంత్రి సవిత
- కీసర వద్ద మద్యం తాగి లారీలో నిద్రపోయిన క్లీనర్ మృతి
- నేటి నుంచే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ‘మసులా బీచ్ ఫెస్టివల్’
- పనులు ఆలస్యమైతే.. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేస్తా: MLA వెనిగండ్ల
-
బీచ్ ఫెస్టివల్‌లో అడ్వెంచర్స్‌గా పారా గ్లైడింగ్..!
కృష్ణా: మసులా బీచ్ ఫెస్టివల్‌లో పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫెస్టివల్‌కు వస్తున్న పర్యాటకులు తమ పిల్లలతో పారా రైడింగ్ చేయిస్తున్నారు. పారా రైడింగ్‌ను అడ్వెంచర్ స్పోర్ట్స్‌గా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పారా రైడింగ్‌కు ఒకొక్కరికి రూ.2వేలు వసూళ్లు చేస్తున్నారు.
-
మద్యం తాగి లారీలో నిద్రపోయిన క్లీనర్ మృతి
ఎన్టీఆర్: ఛత్తీస్‌గఢ్ నుంచి కంచికచర్ల మండలం కీసరకు మొక్కజొన్నల లోడుతో వస్తున్న లారీలో క్లీనర్ మృతి చెందాడు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి భద్రాచలం వద్ద మద్యం సేవించిన క్లీనర్ లారీలో నిద్రపోయాడు. కీసర చేరుకున్నాక అతన్ని లేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు డ్రైవర్ గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
-
‘ఏపీలో నిరుద్యోగులను ఆదుకోవాలి’
ఎన్టీఆర్: విజయవాడలో నవ్యాంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాతులూరి కుమార్, రాష్ట్రస్థాయి ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న, సమస్యలు, ఇబ్బందులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 20లక్షల ఉద్యోగ కల్పన అనే నిర్ణయం మా నిరుద్యోగులకు వరమని కొనియాడారు.