కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నేడు ‘మసులా బీచ్ ఫెస్టివల్’ ఘనంగా ప్రారంభమైంది. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఈవెంట్‌గా గుర్తింపు పొందిన ఈ ఫెస్టివల్ జూన్ 5నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు సాగనుంది. సముద్ర తీరంలోని అందాలను పరిచయం చేయడమే కాకుండా, పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.