Locations: Krishna

  • పర్యావరణ పరిరక్షణ..భావితరాలకు భవిష్యత్‌: మంత్రి

    కృష్ణా: పెనమలూరులో నేడు మంత్రి సవిత పర్యటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పోరంకిలో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..‘సీఎం చంద్రబాబు పిలుపుమేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నాం. మొక్కలు నాటడమే కాదు, వాటిని రక్షించే బాధ్యత అందరిపై ఉంది. గతంలో జగన్ మొక్కలు నరికించేవాడు. సీఎం చంద్రబాబు పర్యావరణాన్ని కాపాడుతూ భావితరాలకు భవిష్యత్‌ను అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

  • KDCCB ఛైర్మన్‌కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

    ఎన్టీఆర్: కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన నెట్టెం రఘురాంకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని కృష్ణా డీసీసీబి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయవాడలో రఘురాంను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి

    ఎన్టీఆర్: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి సురేష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని మొగల్రాజపురంలో ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి, ఐజేయూ కార్యదర్శి డి.సోమసుందర్, APUWJ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటిని అభినందించారు.

  • ప్రకృతితో మమేకమై జీవించాలి: MLA

    ఎన్టీఆర్: ప్రకృతి సమతుల్యతను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘మనమంతా ప్రకృతితో మమేకమై జీవించాల’న్నారు.

  • ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్

    • మాజీ మంత్రి జోగి రమేష్‌పై కొండపల్లి టీడీపీ అధ్యక్షుడు ఫైర్
    • వెన్నుపోటు పార్టీ YCPనే: బండ్రెడ్డి రాము
    • ఈనెల 9న కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక
    • జగ్గయ్యపేటను పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుదాం: MLA శ్రీరాం

  • రేపు వైద్య శిబిరం.. అన్ని రకాల సేవలు ఉచితం

    కృష్ణా: నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఈనెల 6వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సీనియర్స్ సిటిజన్ ఫోరం, సమరసత సేవా ఫౌండేషన్, బాలాజీ సేవా సంస్థ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని షాన్ హాస్పిటల్స్ సహకారంతో డా.వికాస్ నేతృత్వంలో ఎముకలు, కీళ్లు, మెదడు, వెన్నుముక, మెడ నరాల సంబంధిత వ్యాధులకు వైద్యపరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.

  • ‘జగ్గయ్యపేటను పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుదాం’

    ఎన్టీఆర్: ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ చిల్డ్రన్ పార్క్‌లో ‘వమహోత్సవం-2025’ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సహకరిస్తేనే ప్రకృతి పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. జగ్గయ్యపేటను ఒక పచ్చని పట్టణంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.

  • అభివృద్ధి పథంలో నడిపిస్తా: కాగిత

    కృష్ణా: కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి ఏడాది అయిన సందర్భంగా పెడనలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ చేసిన అన్యాయాలను అరికట్టేందుకే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

  • ఆంధ్రాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో కూటమి ప్రభుత్వం ఏర్పాడి ఏడాది గడిచిన సందర్భంగా పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రోడ్డున పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

  • వెన్నుపోటు పార్టీ YCPనే!

    కృష్ణా: కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా కంకిపాడులో జనసైనికుల వేడుకలు జరిపారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రాము మాట్లాడుతూ.. నరకాసుర పాలన అంతమయ్యే సుపరిపాలన మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 13,326గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించిన ఘనత కూటమికే దక్కిందన్నారు.  వైసీపీనే వెన్నుపోటు పార్టీ అని ఎద్దేవా చేశారు.