Locations: Krishna

  • ‘రెడ్‌బుక్‌లో నీ పేరు ఉంది.. గుర్తుపెట్టుకో’

    ఎన్టీఆర్: మరికొన్ని రోజుల్లో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ జైలుకు వెళ్లబోతున్నాడంటూ కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు చుట్టుకొదురు శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెడ్‌బుక్‌లో నీ పేరు ఉంది. గుర్తుపెట్టుకో’ అని జోగిని శ్రీనివాస్ హెచ్చరించారు. ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో జోగి మాటలకు ‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే భవిష్యత్ ఉండదు’ అని శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

     

  • ఆ జిల్లాల అలర్ట్.. అక్కడ ఉక్కపోత.. అక్కడ వర్షాలు!

    గుంటూరు: రేపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40-41°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • 9న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక

    ఎన్టీఆర్: కొండపల్లి మునిసిపాలిటీగా ఏర్పడి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగగా 2021 నవంబర్‌లో కొండపల్లి మునిసిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో నేటికీ కొండపల్లి మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఆ ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు కొండపల్లి మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక ఈనెల 9న కొండపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో జరగనుంది.

  • ‘మైలవరంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలి’

    ఎన్టీఆర్: మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న రైల్వే స‌మ‌స్య‌ల‌పై విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్(చిన్ని)తో కలసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు డివిజ‌న‌ల్ రైల్వే మేనేజ‌ర్ న‌రేంద్ర ఎ.పాటిల్‌తో విజయవాడలోని డీఆర్ఎమ్ కార్యాల‌యంలో బుధవారం స‌మావేశమయ్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న రైల్వే స‌మ‌స్య‌ల‌ను ఎంపీతో కలసి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్ర‌స్తావించారు.

  • రేషన్ షాపుల్లో తహసీల్దార్ తనిఖీలు

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నంలో రేషన్ షాపులను తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. సక్రమంగా రేషన్ పంపిణీ చేస్తున్నారో? లేదో? తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

  • వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ఎమ్మెల్యే వెనిగండ్ల ఫైర్

    కృష్ణా: వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేసిన వ్యక్తులు, ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా రోడ్లపైకి వచ్చి డ్రామాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు అంటూ నిరసనలు చేస్తున్న వైసీపీ వాళ్లు..20ఏళ్లుగా గుడివాడ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే చేసిన మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలపై సమాధానం చెప్పగలరా అని ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు.

  • ‘శాస్త్రీయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషి’

    ఎన్టీఆర్: శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆ వేదిక నాయకులు తెలిపారు. జన విజ్ఞాన వేదిక కొండపల్లి పట్టణ కమిటీ సమావేశం స్థానిక డాక్టర్ మోహన రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్‌లో బుధవారం జరిగింది. నాయకులు మాట్లాడుతూ.. ప్రధానంగా సామాన్య ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం ప్రచారం చేయడం, శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు.

  • మైలవరంలో శరవేగంగా గండ్లు పూడ్చివేత పనులు

    ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో గత ఏడాది అకాల వర్షాల వల్ల బుడమేరు, వాగులు, చెరువులు, కాల్వలకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పూడ్చివేత పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. కవులూరు శివార్లలో బుడమేరు,తారకరామా కాలువ వద్ద పనులను ఆయన పర్యవేక్షించారు. వ్యవసాయ సీజన్ ముందు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

  • ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్

    • తిరువూరులో గంజాయి పట్టివేత
    • జగన్ వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచారు: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
    • మసులా బీచ్ ఫెస్ట్‌కు ఉచిత బస్ సర్వీసులు
    • చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్

  • ఎంపీ సత్యనారాయణకు సత్కారం

    కృష్ణా: బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘ ఛైర్మన్ పాక సత్యనారాయణ నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన శుభ సందర్భంగా వారిని బుధవారం బీజేపీ నేతలు కలిసి దృశ్యాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు, రాంప్రసాద్, వేములపల్లి వెంకటరమణ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.