కృష్ణా: వైసీపీ వెన్నుపోటు రాజకీయాలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేసిన వ్యక్తులు, ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా రోడ్లపైకి వచ్చి డ్రామాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు అంటూ నిరసనలు చేస్తున్న వైసీపీ వాళ్లు..20ఏళ్లుగా గుడివాడ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే చేసిన మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలపై సమాధానం చెప్పగలరా అని ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు.
Locations: Krishna
-
‘శాస్త్రీయ సమాజ నిర్మాణానికి జేవీవీ కృషి’
ఎన్టీఆర్: శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఆ వేదిక నాయకులు తెలిపారు. జన విజ్ఞాన వేదిక కొండపల్లి పట్టణ కమిటీ సమావేశం స్థానిక డాక్టర్ మోహన రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్‌లో బుధవారం జరిగింది. నాయకులు మాట్లాడుతూ.. ప్రధానంగా సామాన్య ప్రజల్లో శాస్త్ర విజ్ఞానం ప్రచారం చేయడం, శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు.
-
మైలవరంలో శరవేగంగా గండ్లు పూడ్చివేత పనులు
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలో గత ఏడాది అకాల వర్షాల వల్ల బుడమేరు, వాగులు, చెరువులు, కాల్వలకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పూడ్చివేత పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. కవులూరు శివార్లలో బుడమేరు,తారకరామా కాలువ వద్ద పనులను ఆయన పర్యవేక్షించారు. వ్యవసాయ సీజన్ ముందు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
-
ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్
- తిరువూరులో గంజాయి పట్టివేత
- జగన్ వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచారు: ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
- మసులా బీచ్ ఫెస్ట్‌కు ఉచిత బస్ సర్వీసులు
- చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు: ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
-
ఎంపీ సత్యనారాయణకు సత్కారం
కృష్ణా: బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘ ఛైర్మన్ పాక సత్యనారాయణ నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన శుభ సందర్భంగా వారిని బుధవారం బీజేపీ నేతలు కలిసి దృశ్యాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు, రాంప్రసాద్, వేములపల్లి వెంకటరమణ, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
-
‘మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టండి’
కృష్ణా: ఉత్తర చిరువోలులంకలోని డ్రైనేజీలో అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం గ్రామస్థుల ఫిర్యాదు మేరకు మోపిదేవి మండలం ఉత్తర చిరువోలులంక గ్రామంలో అయోధ్య వెళ్లే మురుగు డ్రైనేజీలో మట్టి అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ డ్రైనేజీ పరిధిలోని భూమిలో, డ్రైనేజీలో మట్టి తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
-
ఘనంగా ‘సుపరిపాలన మొదలై ఏడాది’ వేడుకలు
కృష్ణా: ‘సుపరిపాలన మొదలై ఏడాది’ వేడుకలు అవనిగడ్డలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ పిలుపుమేరకు బుధవారం అవనిగడ్డలోని గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. ఎమ్మెల్యే సతీమణి మండలి విజయలక్ష్మి రిబ్బన్ కట్ చేసి, తొలి ముగ్గు వేసి ముగ్గుల పోటీలు ప్రారంభించారు.
-
‘జగన్ వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచారు’
కృష్ణా: వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచి అప్రజాస్వామిక పాలన సాగించిన జగన్.. వెన్నుపోటు దినోత్సవం ప్రకటించటం హాస్యాస్పదం అని ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకోవటం, దాచుకోవడం సిద్ధాంతంగా గత ఐదేళ్ల వైసీపీ పరిపాలన సాగిందని, ఆ భావజాలం నుంచి యంత్రాంగాన్ని బయటకు తేవటం కష్టంగా ఉందన్నారు.
-
‘కూటమి ప్రభుత్వం భయోత్పాతం సృష్టించింది’
కృష్ణా: పెడన నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ ఉప్పాల రాము, జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. పెడన వైసీపీ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమిప్రభుత్వం ఏడాది పాలనలో మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమలో పెట్టి, ఒక్కహామీని అమలు చేయకుండా భయోత్పాతం సృష్టించిందని రాము విమర్శించారు.
-
తిరువూరులో గంజాయి పట్టివేత
ఎన్టీఆర్: తిరువూరు శివారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గంజాయి పట్టుబడింది. బైక్‌పై వస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దాడుల్లో తహశీల్దార్ కాళీ లక్ష్మీ పాల్గొన్నారు.