AP : NTR జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్ గణపతి మండపంలో వినాయకుడిని రూ.3.10 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. కమిటీ 43వ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకొని కరెన్సీ నోట్లతో మండపం, విగ్రహాన్ని అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Locations: Krishna
-
మంత్రి డోలాకు ‘నేను-నా అమరావతి’ అందజేత
ఎన్టీఆర్: మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామిని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య బుధవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బాలకోటయ్యను ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి ఆయన స్వీయ రచన ‘నేను-నా అమరావతి’ పుస్తకాన్ని అందజేశారు.
-
యూరియా కోసం బారులు.. తప్పని తిప్పలు
కృష్ణా: పామర్రు శివరామ కాంప్లెక్స్‌లో మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం వేచి ఉన్నామంటూ రైతులు వాపోతున్నారు. ఆధార్ కార్డ్‌కి ఒక కట్ట యూరియా ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదెకరాలకు 10కట్టాలు అవసరమైతే, ఆధార్ కార్డుపై కేవలం ఒక కట్ట ఇస్తే ఎలా సరిపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు.
-
గణపతి ఆశీస్సులు పొందిన మొండితోక
ఎన్టీఆర్: గణపతికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ప్రత్యేక పూజలు చేశారు. నందిగామ మండలం లింగాలపాడులో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజాకార్యక్రమం నిర్వహించారు. మొండితోక పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
-
క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో విజయవాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 17 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న వారు టోర్నీలో పాల్గొనవచ్చన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను విజయవాడ ప్రీమియర్ లీగకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లను బుధవారం సాయంత్రం 4 గంటలలోపు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు.
-
చెల్లని చెక్కు.. నిందితుడికి జైలు
కృష్ణా: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి 3నెలల జైలుశిక్ష ఖరారు చేస్తూ మచిలీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.సాయిసుధ తీర్పునిచ్చారు. పట్టణంలో రామచంద్రన్ అదే ప్రాంతానికి చెందిన బి.మల్లిఖార్జునరావు వద్ద రూ.6లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే క్రమంలో రామచంద్రన్ రూ.3.50లక్షల చెక్కిచ్చాడు. చెక్కు చెల్లకపోవడంతో మల్లిఖార్జునరావు కోర్టుకెక్కాడు. విచారణలో భాగంగా నేరం రుజువవడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని పోలీసులు తెలిపారు.
-
ఆకట్టుకున్న గణనాథుడు.. రూ.3.10కోట్లతో అలంకరణ
ఎన్టీఆర్: నందిగామలో 43వ గణపతి ఉత్సవ కమిటీవారు రూ. 3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాథుడు అందరినీ అబ్బురపరుస్తుంది. పట్టణంలోని వాసవి బజార్‌లో ఏర్పాటు చేసిన ఈ ‘రాజా దర్బార్ గణపతి’ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కరెన్సీ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
-
గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
ఎన్టీఆర్: కంచికచర్లలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పట్టణంలోని వసంతకాలనీలో ఓ ఇంట్లో రూ. 15వేలు విలువ చేసే 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కంచికచర్ల పోలీసులు వెల్లడించారు. నందిగామకు చెందిన ఆకాష్, కంచికచర్లకు చెందిన రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
-
నేడు నారా లోకేష్‌తో.. వంగవీటి రాధా భేటీ
AP : విజయవాడలో బుధవారం మంత్రి నారా లోకేష్‌తో.. వంగవీటి రాధా సమావేశం కానున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 11నెలల తర్వాత ఇద్దరునేతల భేటీలో అజెండా అంశంపై రకరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమ నేతకు MLCసహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి వర్గంలో ఉంది. వంగవీటికి ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అనే చర్చ మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది.
-
PVN పర్యటన రేపే!
కృష్ణా: మచిలీపట్నంలో ఈనెల 4వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటించనున్నారు. ‘సారథ్యం’ పేరుతో మాధవ్ మొదలుపెట్టిన పర్యటనలో భాగంగా మచిలీపట్నంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.