Locations: Krishna

  • రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు..రయ్‌రయ్

    ఎన్టీఆర్: రాయనపాడు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్‌ల తరహాలోనే రాయనపాడు అభివృద్ధి చెందుతుండటంతో విజయవాడ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందన్నారు.

  • పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

    ఎన్టీఆర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ఆన్‌లైన్ యాప్ ద్వారా విక్రయాలు, నాణ్యమైన పశు దాణా తయారీ, రైతుసేవా కేంద్రాల ద్వారా సరైన ధరలతో ఎరువుల సరఫరా తదితర సేవలను రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

  • IRCS సమావేశం 20న: కలెక్టర్

    కృష్ణా: ఈనెల 20వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(IRCS) కృష్ణా జిల్లా శాఖ వార్షిక సాధారణ సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్, సొసైటీ అధ్యక్షుడు డీకే. బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశం అనంతరం నూతన జిల్లా మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

  • రైల్వే TRD విభాగానికి ISO ధ్రువపత్రం

    AP : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ ట్రాక్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ (TRD) విభాగానికి ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్‌ లభించింది. హైదరాబాద్‌లోని హర్ష టెక్నాలజీస్‌ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి విజయవాడ డివిజన్‌కు ఈ సర్టిఫికేషన్‌ను ఇచ్చింది. భారతీయ రైల్వేలలోనే TRD విభాగానికి ధ్రువీకరణ పొందిన మొదటి డివిజన్‌గా విజయవాడ డివిజన్‌ గుర్తింపు పొందింది.

  • పోలీస్ స్టేషన్ ఎదుటే పాడుపని.. అడ్డంగా బుక్కయ్యారు!

    కృష్ణా: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. అవనిగడ్డ పోలీస్‌స్టేషన్ ఎదుట తనిఖీలు చేపట్టగా, మోపిదేవి మండలం పెదకల్లేపల్లికి చెందిన కుతాడ వెంకన్నకు సంబంధించిన 2,500 కిలోలు, అవనిగడ్డకు చెందిన కోసూరు రాజారావుకు చెందిన 2,000కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి, రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  • కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కృషి చేస్తా: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు తన వంతు కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టే‌షన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. కృష్ణప్రసాదు మాట్లాడుతూ.. కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

  • 2కే రన్‌లో ‘భైరవం’ టీమ్ సందడి!

    కృష్ణా: ఈనెల 5వ తేదీ నుంచి మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న సందర్భంగా మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ నుంచి లక్ష్మి టాకీస్ వరకు 2కే రన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ‘భైరవం’ చిత్ర హీరోలు మంచుమనోజ్, నారారోహిత్, చిత్ర దర్శకులు విజయ్ కనకమేడల పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి బీచ్ ఫెస్టివల్ వల్ల టూరిజం పెరుగుతుందన్నారు.

  • వీధి కుక్క దాడి.. బాలుడికి గాయాలు

    ఎన్టీఆర్: కొండపల్లిలో విధి కుక్క స్వైర విహారం చేస్తోంది. ప్రతిరోజు పిల్లలపై దాడి చేస్తూ గాయపరుస్తున్న వీధి కుక్క మంగళవారం ఉదయం ఓ బాలుడుపై దాడి చేసింది. దాడిలో బాలుడు గాయపడ్డాడు. ప్రజలపై కుక్కలు దాడి చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • విజయవాడలోని LIC భవనానికి బాంబు బెదిరింపు

    AP: విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో ఉన్న LIC భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసి బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌ బీసెంట్‌ రోడ్డులోని దుకాణాలను తనిఖీ చేస్తున్నారు.

  • రాజకీయ కక్షతో పెన్షన్ నిలిపేశారని ఆవేదన

    కృష్ణా: రాజకీయ కక్షతో తన వృద్ధాప్య పెన్షన్ నిలిపివేశారని నాగరాజు అనే వ్యక్తి ఆరోపించారు. పెడన మండలం లంకలకలవగుంట గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త, కూటమి నేతలు అడ్డుపడ్డారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మనస్థాపానికి గురిచేస్తోందని కన్నీరు పెట్టుకున్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.