ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వైసీపీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్‌కు వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Locations: Krishna
-
మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ వేడుకలు ఘనంగా..!
కృష్ణా: గుడివాడలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మందితో నందివాడ మండలం నుంచి కమిటీ ఛైర్మన్ చాట్రగడ్డ రవి ర్యాలీగా బయలుదేరారు. జొన్నపాడు వద్ద ర్యాలీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. వారికి ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
-
నిత్య యోగా సాధనతో దేహం వజ్రకాయం
ఎన్టీఆర్: నిత్య యోగా సాధనతో దేహం వజ్రకాయం అవుతుందని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్(డీఎస్పీ) పి.కృష్ణమాచారి అన్నారు. ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని ఎ.కాలనీ బాస్కెట్ బాల్ కోర్టులో ఎన్టీటీపీఎస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) వారికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాంతివన్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షత వహించారు.
-
మసులా బీచ్ ఫెస్ట్‌కు ఉచిత బస్ సర్వీసులు
కృష్ణా జిల్లాలో మసులా బీచ్ ఫెస్టివల్‌కు ఉచిత బస్ సర్వీసులను కొల్లు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నట్లు అధికారులు తెలిపారు. చింతచెట్టు సెంటర్, కోనేరుసెంటర్, కాలేఖాన్‌పేట, మూడు స్థంభాల సెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి బస్ సౌకర్యం కల్పించామన్నారు.
-
ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్
- జగనే నిజమైన వెన్నుపోటు దారుడు : కొలికపూడి
- కృష్ణా జిల్లాలో మసూల బీచ్ ఫెస్టివల్.. వన్-వే ట్రాఫిక్ అమలు: ఎస్పీ
- ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ లక్ష్మీశ
- ఈనెల 20న IRCS సమావేశం: కలెక్టర్ బాలాజీ
- దక్షిణ మధ్య రైల్వే విజయవాడ TRD విభాగానికి ISO ధ్రువపత్రం
-
జగనే నిజమైన వెన్నుపోటు దారుడు : కొలికపూడి
ఎన్టీఆర్: ఏపీ రాజకీయాల్లో నిజమైన వెన్నుపోటు దారుడు మాజీ సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులో మాట్లాడుతూ ‘‘సొంత పార్టీ కార్యకర్తలకు కూడా వెన్నుపోటు పొడిచింది జగనే. వైఎస్సార్ ఫ్యామిలీకి 45 సంవత్సరాల రాజకీయం జీవితం ఇచ్చిన రాయలసీమ ప్రాంతానికి జగన్ నీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా’’ అని ప్రశ్నించారు.
-
మసూల బీచ్ ఫెస్టివల్.. వన్-వే ట్రాఫిక్ అమలు
కృష్ణా జిల్లాలో నిర్వహించనున్న మసూల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు వన్-వే ట్రాఫిక్ అమల్లో ఉంటుందన్నారు. చల్లపల్లి, విజయవాడ నుంచి వచ్చేవారు చిలకలపూడి, తపసిపూడి మీదుగా మంగినపూడి బీచ్ చేరాలన్నారు. భీమవరం నుంచి వచ్చేవారు పెదపట్నం, తాళ్లపాలెం మార్గంలో రావాలన్నారు.
-
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు..రయ్‌రయ్
ఎన్టీఆర్: రాయనపాడు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రైల్వేస్టేషన్‌ల తరహాలోనే రాయనపాడు అభివృద్ధి చెందుతుండటంతో విజయవాడ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
-
పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
ఎన్టీఆర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ఆన్‌లైన్ యాప్ ద్వారా విక్రయాలు, నాణ్యమైన పశు దాణా తయారీ, రైతుసేవా కేంద్రాల ద్వారా సరైన ధరలతో ఎరువుల సరఫరా తదితర సేవలను రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
-
IRCS సమావేశం 20న: కలెక్టర్
కృష్ణా: ఈనెల 20వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(IRCS) కృష్ణా జిల్లా శాఖ వార్షిక సాధారణ సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్, సొసైటీ అధ్యక్షుడు డీకే. బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశం అనంతరం నూతన జిల్లా మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.