కృష్ణా: వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచి అప్రజాస్వామిక పాలన సాగించిన జగన్.. వెన్నుపోటు దినోత్సవం ప్రకటించటం హాస్యాస్పదం అని ఏపీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఛైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకోవటం, దాచుకోవడం సిద్ధాంతంగా గత ఐదేళ్ల వైసీపీ పరిపాలన సాగిందని, ఆ భావజాలం నుంచి యంత్రాంగాన్ని బయటకు తేవటం కష్టంగా ఉందన్నారు.