ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్‌లోని ప్రసాద్ కొట్టు వీధిలో నివాసాల మధ్య మురుగు ప్రజలకు శాపంగా మారింది. ఖాళీ స్థలాల్లో మురుగునీటి తటాకంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. స్థానికులు వ్యాధుల భయంతో వణుకుతున్నారు. నాలుగేళ్ల క్రితం మెదడువాపుతో బాలుడి మృతిపై మరింత భయాందోళన చెందుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని నివాసితులు కోరుతున్నారు.
Locations: Krishna
-
‘చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు’
ఎన్టీఆర్: నందిగామలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా RDO కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నేడు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.
-
‘రమణ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలి’
ఎన్టీఆర్: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతి సందర్భంగా కంచికచర్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వెంకటరమణ, ఆయన సతీమణి ప్రణీత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రమణ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
-
‘దేవినేని వెంకటరమణ ప్రజల మనసు గెలుచుకున్నారు’
ఎన్టీఆర్: మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ 26వ వర్ధంతి సందర్భంగా కంచికచర్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ శ్రేణులు దేవినేని వెంకటరమణ, ఆయన సతీమణి ప్రణీత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. అనంతరరం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. దేవినేని వెంకటరమణ మంత్రిగా అతి తక్కువ కాలంలో ప్రజల మనస్సులను గెలుచుకున్నాని పేర్కొన్నారు.
-
వారిని వదిలే ప్రసక్తే లేదు : దేవినేని అవినాష్
ఎన్టీఆర్: ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ సర్కిల్-3 కార్యాలయంలో సూపరింటెండెంట్ బీఎస్ఆర్‌కే ప్రసాద్‌కు మెమెరాండం ఇచ్చారు. కూటమి మోసాలపై మెమెరాండం ఇద్దామని వస్తే తహశీల్దార్ సెలవుపెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. తప్పుచేసిన ఏ అధికారిని, నాయకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
-
సుపరిపాలన మొదలై ఏడాది!
ఎన్టీఆర్: సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం ఉదయం విజయవాడ తూర్పు నియోజక వర్గంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రంగవల్లులు వేసిన మహిళలని వారు అభినందించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, తదితరులు పాల్గొన్నారు.
-
జగ్గయ్యపేటలో ‘వెన్నుపోటు దినం’
ఎన్టీఆర్: జగ్గయ్యపేటలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వైసీపీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహశీల్దార్‌కు వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
-
మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ వేడుకలు ఘనంగా..!
కృష్ణా: గుడివాడలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మందితో నందివాడ మండలం నుంచి కమిటీ ఛైర్మన్ చాట్రగడ్డ రవి ర్యాలీగా బయలుదేరారు. జొన్నపాడు వద్ద ర్యాలీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. వారికి ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
-
నిత్య యోగా సాధనతో దేహం వజ్రకాయం
ఎన్టీఆర్: నిత్య యోగా సాధనతో దేహం వజ్రకాయం అవుతుందని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్(డీఎస్పీ) పి.కృష్ణమాచారి అన్నారు. ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని ఎ.కాలనీ బాస్కెట్ బాల్ కోర్టులో ఎన్టీటీపీఎస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) వారికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాంతివన్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షత వహించారు.
-
మసులా బీచ్ ఫెస్ట్‌కు ఉచిత బస్ సర్వీసులు
కృష్ణా జిల్లాలో మసులా బీచ్ ఫెస్టివల్‌కు ఉచిత బస్ సర్వీసులను కొల్లు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నట్లు అధికారులు తెలిపారు. చింతచెట్టు సెంటర్, కోనేరుసెంటర్, కాలేఖాన్‌పేట, మూడు స్థంభాల సెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి బస్ సౌకర్యం కల్పించామన్నారు.