కృష్ణా జిల్లాలో నిర్వహించనున్న మసూల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు వన్-వే ట్రాఫిక్ అమల్లో ఉంటుందన్నారు. చల్లపల్లి, విజయవాడ నుంచి వచ్చేవారు చిలకలపూడి, తపసిపూడి మీదుగా మంగినపూడి బీచ్ చేరాలన్నారు. భీమవరం నుంచి వచ్చేవారు పెదపట్నం, తాళ్లపాలెం మార్గంలో రావాలన్నారు.