Locations: Krishna

  • చెల్లని చెక్కు.. నిందితుడికి జైలు

    కృష్ణా: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి 3నెలల జైలుశిక్ష ఖరారు చేస్తూ మచిలీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.సాయిసుధ తీర్పునిచ్చారు. పట్టణంలో రామచంద్రన్ అదే ప్రాంతానికి చెందిన బి.మల్లిఖార్జునరావు వద్ద రూ.6లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చే క్రమంలో రామచంద్రన్ రూ.3.50లక్షల చెక్కిచ్చాడు. చెక్కు చెల్లకపోవడంతో మల్లిఖార్జునరావు కోర్టుకెక్కాడు. విచారణలో భాగంగా నేరం రుజువవడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని పోలీసులు తెలిపారు.

  • ఆకట్టుకున్న గణనాథుడు.. రూ.3.10కోట్లతో అలంకరణ

    ఎన్టీఆర్: నందిగామలో 43వ గణపతి ఉత్సవ కమిటీవారు రూ. 3.10 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాథుడు అందరినీ అబ్బురపరుస్తుంది. పట్టణంలోని వాసవి బజార్‌లో ఏర్పాటు చేసిన ఈ ‘రాజా దర్బార్ గణపతి’ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కరెన్సీ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

  • గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

    ఎన్టీఆర్: కంచికచర్లలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పట్టణంలోని వసంతకాలనీలో ఓ ఇంట్లో రూ. 15వేలు విలువ చేసే 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కంచికచర్ల పోలీసులు వెల్లడించారు. నందిగామకు చెందిన ఆకాష్, కంచికచర్లకు చెందిన రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

  • నేడు నారా లోకేష్‌తో.. వంగవీటి రాధా భేటీ

    AP : విజయవాడలో బుధవారం మంత్రి నారా లోకేష్‌తో.. వంగవీటి రాధా సమావేశం కానున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 11నెలల తర్వాత ఇద్దరునేతల భేటీలో అజెండా అంశంపై రకరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమ నేతకు MLCసహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి వర్గంలో ఉంది. వంగవీటికి ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అనే చర్చ మాత్రం హాట్‌‌టాపిక్‌గా మారింది.

  • PVN పర్యటన రేపే!

    కృష్ణా: మచిలీపట్నంలో ఈనెల 4వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటించనున్నారు. ‘సారథ్యం’ పేరుతో మాధవ్ మొదలుపెట్టిన పర్యటనలో భాగంగా మచిలీపట్నంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

  • పదమూడేళ్లకే కుటుంబ బాధ్యత అప్పగించారు!

    కృష్ణా: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లుతున్నాయి. బాపులపాడు మండలం రేమల్లెలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తుమ్మల శ్రావ్య(13)కు కుటుంబ పెద్దగా పేర్కొంటూ ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ అయింది. గతంలో ఆమె తన తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యురాలిగా ఉండగా..ఇప్పుడామె పేరు మీద ప్రత్యేకంగా మరో కార్డు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

     

     

  • స్నాతకోత్సవాలకు డేట్ ఫిక్స్

    ఎన్టీఆర్: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 27, 28వ స్నాతకోత్సవాలకు తేదీ ఖరారైంది. ఈనెల 9వ తేదీన నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్నాతకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి డా.పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ముఖ్యఅతిథులగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, న్యూఢిల్లీ నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఛీఫ్ కార్డియాక్ సర్జన్ ఒ.పి.యాదవ హాజరవుతారని వెల్లడించారు.

  • యూరియా లారీని అడ్డుకున్న రైతులు

    కృష్ణా: మొవ్వ మండలం చినముత్తేవిలో రైతులు యూరియా లారీని అడ్డుకున్నారు. సొసైటీలకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు యూరియా తరలిస్తున్నారని ఆరోపించారు. రాత్రి 8 గంటల నుంచి రైతులు రోడ్డుపై బైఠాయించి, లారీలోని మొత్తం యూరియాను గ్రామ రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో, పోలీసులు కలుగజేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • PACS పాత్ర అపారం: నెట్టెం

    ఎన్టీఆర్: నందిగామలో జరుగుతున్న Primary Agricultural Cooperative Societies(PACS)Presidents ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నందిగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారితో కలిసి మాజీమంత్రి నెట్టెం రఘురామ్ ప్రారంభించారు. శిబిరానికి 50మంది PACS అధ్యక్షులు హాజరయ్యారు. ఈసందర్భంగా నెట్టెం మాట్లాడుతూ.. సహకార ఉద్యమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని రైతుల అవసరాలను తీర్చడంలో PACS పాత్ర అపారమన్నారు.

  • నందిగామలో పవర్ స్టార్ జన్మదిన వేడుకలు

    ఎన్టీఆర్: నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రమాదేవి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. సూర సత్యనారాయణ, కరి రమేష్, కొమ్మవరపు స్వామి, కొట్టె బద్రి, పుప్పాల భరత్ సాయి, వీర మహిళలు గోపిశెట్టి నాగలక్ష్మి, కామసాని సుగుణ తదితరులు పాల్గొన్నారు.