AP : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ (TRD) విభాగానికి ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. హైదరాబాద్‌లోని హర్ష టెక్నాలజీస్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి విజయవాడ డివిజన్‌కు ఈ సర్టిఫికేషన్‌ను ఇచ్చింది. భారతీయ రైల్వేలలోనే TRD విభాగానికి ధ్రువీకరణ పొందిన మొదటి డివిజన్‌గా విజయవాడ డివిజన్ గుర్తింపు పొందింది.






