
Locations: Krishna
-
ముంజులూరులో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
కృష్ణా: పెడన నియోజకవర్గంలోని ముంజులూరు గ్రామంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రాజశేఖర్, రామ్‌నాధ్, సతీష్ బేతు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జనసేన సెంట్రల్ రాష్ట్ర కో-కన్వీనర్ వికృతి శ్రీనివాస్, బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు, డీసీ ఛైర్మన్ బొర్రా కాశీ, జనసేన మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ హాజరయ్యారు. -
పురిటిగడ్డ సొసైటీ ఛైర్ పర్సన్‌గా హరినాథ్
కృష్ణా: చల్లపల్లి మండలం పురిటిగడ్డ సొసైటీ ఛైర్ పర్సన్‌గా పెద్దిబోయిన హరినాథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ హరినాథ్, పర్సన్ యార్లగడ్డ రమేష్ బాబులకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఈవో కంఠంనేని నాగేశ్వరరావు, నేతలు పరుచూరి సురేష్, కైతేపల్లి శ్రీనివాసరావు, మాతంగి వేణు, రాజులపాటి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
-
నిబంధనలకు లోబడి ఈ-టెండర్లు పిలవాలి: కలెక్టర్
కృష్ణా: జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి కొత్తగా ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి ఈ-టెండర్లు పిలవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ఇసుక నిల్వల స్థితిగతులపై ఈ సమావేశంలో సమీక్షించారు.
-
బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రమేష్‌కు ఘన సన్మానం
ఎన్టీఆర్: బీజేపీ నందిగామ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన మాదాల రమేష్‌ని నియోజకవర్గ నాయకులు, కాకాని నగర్ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈనెల 5వ తేదీన ఆయన జరగబోయే సారధ్యం రాష్ట్ర అధ్యక్షులు పర్యటనలో భాగంగా నందిగామ సందర్శించిన వారిని సందర్భంగా ముఖ్య నాయకుల సమావేశంలో వారు పలు సూచనలు చేశారు.
-
కంచికచర్ల మండలంలో చెరువుల కళకళ..!
ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కంచికచర్ల, పరిటాల ప్రాంతంలో సాగునీటి చెరువులు జల కలను సంతరించుకుంటున్నాయి. గత నాలుగు రోజులు కురిసిన వర్షాలతో వాగులు పొంగి ప్రవహించి జల కలను సంతరించుకుంటున్నాయి. నీటితో కలకలాడుతున్న చెరువులను చూసి ఆయకట్టు పరిధిలోని రైతులు మోములో ఆనందం వెల్లివిరిసింది.
-
ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు
ఎన్టీఆర్: కొండపల్లి 9వ డివిజన్ యాదవుల బజార్ బావి సెంటర్‌లో మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మాజీ మండల ప్రధాన కార్యదర్శి సాకిరి వెంకట నరసయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రసాద్, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘రాజకీయ, సినీ రంగాల్లో పవన్‌కళ్యాణ్ ఉన్నత స్థానంలోకి రావాలి’
ఎన్టీఆర్: చండ్రగూడెం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీలక్ష్మీనారాయణస్వామి, దాసాంజనేయస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. జనసైనికులు, వీర మహిళలు పవన్‌కళ్యాణ్ ఆయురారోగ్యాలు, రాజకీయ, సినీ రంగాల్లో మరింత ఉన్నత స్థానంలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో మైలవరం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ, జనసేన మైలవరం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
నూజివీడులో పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
ఏలూరు: నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో స్నేహరై అనాథాశ్రమంలో, గాంధీబొమ్మ సెంటర్‌లో జనసేన నాయకులు కేక్ కట్ చేసి పవన్‌కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనాధాశ్రమంలో పిల్లలకు ఉదయం అల్పాహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంచారు. డిప్యూటీ సీఎంగా సేవలు చేస్తున్న పవన్‌కళ్యాణ్ మరెన్నో శిఖరాలు చేరుకోవాలని ఫణి బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
-
మచిలీపట్నంలో మెగా రక్తదాన శిబిరం
కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, DCMS ఛైర్మన్ బండి రామకృష్ణ ప్రారంభించారు. జనసైనికులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. అనంతరం నగరంలోని పలుచోట్ల జరిగిన పవన్ జన్మదిన వేడుకల్లో బండి రామకృష్ణ పాల్గొన్నారు.
-
వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి
కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అబ్దుల్ మతీన్, కోకా ఫణి భూషణ్, కొడమంచలి చంద్రశేఖర్, చిలుకోటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.