ఎన్టీఆర్: స్టేట్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఇంటిమాల ప్రవీణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నందిగామ ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూటమి నేతలతో కలసి ప్రవీణను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Locations: Krishna
-
గణనాథుని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత
ఎన్టీఆర్: మైలవరం పట్టణంలో చవితి పూజలనందుకుంటున్న గణనాథుడిని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ వినాయకుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
-
మచిలీపట్నంలో దంపతుల చేతివాటం
కృష్ణా: మచిలీపట్నంలో దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.55లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. చల్లపల్లి పీఎస్ పరిధిలో ఇరుగుపొరుగు వారితో స్నేహంగా ఉంటూ వారి విలువైన వస్తువులు గమనిస్తూ ఇంటి వద్ద లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న రహంతున్నిసా, నసీబుల్లాలను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం వారిపై 3కేసులు నమోదు చేశారు.
-
వైఎస్‌ఆర్ వర్థంతి.. గ్రామాల్లో అన్నదానం
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరులపాడు, కంచికచర్ల, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదాన, సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్ నేతల నివాళి
ఎన్టీఆర్: నందిగామలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త మందా వజ్రయ్య, పీసీసీ సభ్యులు పాలేటి సతీష్, నాయకులు అనిల్ కుమార్, మాజీ డీసీసీ కార్యదర్శి శ్యామ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
-
టీడీపీ సీనియర్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
ఎన్టీఆర్: వీరులపాడు మండలం చౌటపల్లిలో టీడీపీ సీనియర్ నేత గురజాల అజయ్ సతీమణి, మాజీ ఎంపీటీసీ విజయ రాణి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సత్యనారాయణ బాబు, తదితరులు ఉన్నారు.
-
బ్యాంక్ అధికారులను కలిసిన పీఏసీఎన్ అధ్యక్షులు
కృష్ణా: కోడూరు మండలంలో కొత్తగా ఎన్నికైన పీఏసీఎస్ అధ్యక్షులు సాంబశివరావు, సత్యనారాయణ, విటల్ రావులు స్థానిక కేడీసీసీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ పూర్ణచంద్రరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరు బ్యాంకు అధికారులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది శ్రీనివాసరావును కూడా ఘనంగా సత్కరించారు.
-
‘ఛలో విజయవాడ’ పోస్టర్ ఆవిష్కరణ
ఎన్టీఆర్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపి నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నందిగామలోని కేవీఆర్ కళాశాలలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి షేక్ ఖజు, మండల అధ్యక్షుడు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
-
గణేష్ లడ్డూ వేలంపాట
ఎన్టీఆర్: పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని అమ్మవారి గుడి దగ్గర జరిగిన గణేష్ లడ్డూల వేలంలో మొదటి లడ్డూను మూడవతు శ్రీనివాసరావు రూ.55,000కి దక్కించుకున్నారు. రెండో లడ్డూను శ్రీరామ్ మూర్తి రూ.30,000కి పాడి కైవసం చేసుకున్నారు. గణేష్ నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న విగ్నేశ్వరుని లడ్డుని దక్కించుకున్న శ్రీనివాసరావు, శ్రీరామ్ మూర్తిలను వినాయక కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
-
‘అపర భగీరథుడు వైఎస్ఆర్’
ఎన్టీఆర్: కొండపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్దంతి నిర్వహించారు. కార్య క్రమంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షులు బొర్రా కిరణ్, చిలుకూరు సర్పంచ్ గొంది సురేష్‌లు పాల్గొని వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..అపర భగీరథుడు వైఎస్‌ఆర్ అని కొనియాడారు.