ఎన్టీఆర్: నందిగామలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త మందా వజ్రయ్య, పీసీసీ సభ్యులు పాలేటి సతీష్, నాయకులు అనిల్ కుమార్, మాజీ డీసీసీ కార్యదర్శి శ్యామ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Locations: Krishna
-
టీడీపీ సీనియర్ నేత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
ఎన్టీఆర్: వీరులపాడు మండలం చౌటపల్లిలో టీడీపీ సీనియర్ నేత గురజాల అజయ్ సతీమణి, మాజీ ఎంపీటీసీ విజయ రాణి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట కంచికచర్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సత్యనారాయణ బాబు, తదితరులు ఉన్నారు.
-
బ్యాంక్ అధికారులను కలిసిన పీఏసీఎన్ అధ్యక్షులు
కృష్ణా: కోడూరు మండలంలో కొత్తగా ఎన్నికైన పీఏసీఎస్ అధ్యక్షులు సాంబశివరావు, సత్యనారాయణ, విటల్ రావులు స్థానిక కేడీసీసీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ పూర్ణచంద్రరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరు బ్యాంకు అధికారులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది శ్రీనివాసరావును కూడా ఘనంగా సత్కరించారు.
-
‘ఛలో విజయవాడ’ పోస్టర్ ఆవిష్కరణ
ఎన్టీఆర్: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6వ తేదీ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపి నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నందిగామలోని కేవీఆర్ కళాశాలలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి షేక్ ఖజు, మండల అధ్యక్షుడు నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
-
గణేష్ లడ్డూ వేలంపాట
ఎన్టీఆర్: పశ్చిమ ఇబ్రహీంపట్నంలోని అమ్మవారి గుడి దగ్గర జరిగిన గణేష్ లడ్డూల వేలంలో మొదటి లడ్డూను మూడవతు శ్రీనివాసరావు రూ.55,000కి దక్కించుకున్నారు. రెండో లడ్డూను శ్రీరామ్ మూర్తి రూ.30,000కి పాడి కైవసం చేసుకున్నారు. గణేష్ నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న విగ్నేశ్వరుని లడ్డుని దక్కించుకున్న శ్రీనివాసరావు, శ్రీరామ్ మూర్తిలను వినాయక కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
-
‘అపర భగీరథుడు వైఎస్ఆర్’
ఎన్టీఆర్: కొండపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్దంతి నిర్వహించారు. కార్య క్రమంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షులు బొర్రా కిరణ్, చిలుకూరు సర్పంచ్ గొంది సురేష్‌లు పాల్గొని వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..అపర భగీరథుడు వైఎస్‌ఆర్ అని కొనియాడారు.
-
గ్రామ స్వరాజ్య సాధనకు పవన్ కృషి: ఎమ్మెల్యే
కృష్ణా: రాష్ట్రంలో గ్రామ స్వరాజ్య సాధనకు పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
-
సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్: మాజీ మంత్రి
కృష్ణా: కేతనకొండలో నిర్వహించిన వైస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సూపర్ సిక్స్ హిట్ కాదు అట్టర్ ప్లాప్ అని, 16 నెలల్లోనే ప్రజలు మహానేత తనయుడు జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ వర్ధంతి జరుపుకుంటూ నేటికీ మహానేతను స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.
-
‘పవన్‌కల్యాణ్ యువతకు ఆదర్శం’
ఎన్టీఆర్: కొండపల్లి పట్టణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అక్కల రామ్మోహన్రావు(గాంధీ), కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చిట్టిబాబులు పాల్గొని మాట్లాడారు. ఉపముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్న పవన్ కల్యాణ్ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
-
7న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ముసివేత
కృష్ణా: మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా ముసివేస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్& ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. చంద్రగ్రహణం ముగిసిన మరుసటి రోజు ఉదయం ఆలయంలో పుణ్యాహవాచనం నిర్వహించి, ఉదయం 10 గంటల నుంచి భక్తులకు స్వామివారి సర్వదర్శం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.