Locations: Krishna

  • మహిళ మెడలో గొలుసు చోరీ!

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పోస్టాఫీసు ఎదురుగా నిలుచున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని పల్సర్ బైక్‌పై పరారయ్యారు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఆరు నెలలుగా దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

     

  • నందిగామలో చైన్‌ స్నాచింగ్‌

    AP: NTR జిల్లాలోని నందిగామలో చైన్‌ స్నాచింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై మాస్కులు వేసుకుని వచ్చిన ఇద్దరు దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. గుర్రం మనోహరి అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆమె మెడలోని 100 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని వెళ్లారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • పరిటాలలో వ్యాపార సంస్థలు బంద్!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో బంద్ చేపట్టారు. పార్టీలకు అతీతంగా విశ్వ హిందూ పరిషత్, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్‌ను పాటిస్తున్నారు. హిందూ సంఘాల పిలుపు మేరకు పలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్‌కు మద్ధతు తెలిపాయి.

     

     

  • జూదశిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్!

    కృష్ణా: జూద శిబిరంపై దాడి చేసి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఎ.సీతారాంపురంలో ఆదివారం సాయంత్రం వీరవల్లి పోలీసులు జూద శిబిరాలపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు జూదరులను అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ.26,530, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

  • ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు.. 11న!

    కృష్ణా: మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అండర్-14 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 11న నిర్వహిస్తామని క్రికెట్ సంఘం కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలి పారు. సెప్టెంబరు ఒకటి, 2011 తర్వాత.. అక్టోబరు 31, 2013 మధ్యలో జన్మించిన వారు పోటీలకు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్‌కార్డు, బర్త్ సర్టిఫికేట్‌తోపాటు సొంత క్రికెట్ కిట్‌తో 11న ఉదయం 8గంటలకు స్టేడియంలో హాజరుకావాలన్నారు.

  • జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక!

    కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిచనున్నారు. సోమవారం జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ పీజీఆర్‌ఎస్ ఉంటుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజలు గమనించి మండల, డివిజన్ కేంద్రాల్లో అర్జీలు సమర్పిస్తే అధికారులు తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

  • షార్ట్ సర్క్యూట్‌తో మిఠాయి షాప్ దగ్ధం

    కృష్ణా: పామర్రులో తాడిశెట్టి నాగేశ్వరరావు మిఠాయి షాప్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా దగ్ధమైంది. ఎన్నో సంవత్సరాలుగా స్థానికులకు తక్కువ ధరలో నాణ్యమైన మిఠాయిలు అందిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. సుమారు రూ.15 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ స్వీట్ షాప్ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ తాడిశెట్టి నరేష్‌కి చెందినది తెలుస్తోంది.

  • నేడు కంచికచర్ల బంద్‌.. హిందూ సంఘాల పిలుపు!

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాలలో వినాయక చవితి ఊరేగింపులో హిందువులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈదాడికి నిరసనగా పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ సోమవారం హిందూ సంఘాలు మండల వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు హిందువులందరూ మద్దతు తెలిపి సహకరించాలని కోరారు. హిందువులపై రాళ్లదాడి చేసి విద్యార్థులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

  • ఘనంగా డీసీసీ ఛైర్మన్ జన్మదిన వేడుకలు

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో డీసీ ఛైర్మన్ కాపా రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మండల టీడీపీ కార్యాలయంలో ఆయన అభిమానులు మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా రాంబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

     

  • నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!

    ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మూడు రోజుల పాటు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఈనెల 8, 9, 10వ తేదీల్లో నందిగామ పట్టణం, కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ప్రజలకు, అధికారులకు, కూటమి నేతలకు అందుబాటులో ఉండరని ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.