Locations: Krishna

  • తెలంగాణ మంత్రికి ఘన స్వాగతం

    కృష్ణా: చల్లపల్లి మండలంలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు విచ్చేసిన తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి ఓఎస్‌డీ ప్రకాష్, ఆర్డీఓ స్వాతి, తహశీల్దార్ మధుసూదన్‌రావులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

  • రోగులకు పండ్లు పంపిణీ

    కృష్ణా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెడన పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు జనసేన నాయకులు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో జన సైనికులు రఘురామ్, వెంకయ్య, శివ, పావని, పరమేశ్వరావు, జయకృష్ణ, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని 18వ వార్డు డీవీఆర్ కాలనీలో మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి కూటమి నేతలతో కలిసి గణేష్ పందిరిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • భక్తులకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద శ్రీ సీతారామాంజనేయ కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ అన్నదాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గణేష్ పందిరిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కృష్ణకుమారి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సీతారామయ్యతో కలిసి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు.

  • రామానగరంలో తెలంగాణ మంత్రి

    కృష్ణా: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం చల్లపల్లి మండలం రామానగరం గ్రామానికి వచ్చారు. తన స్నేహితుడు కంఠంనేని వెంకట రంగయ్య బాబు తల్లి బసవ భారతి దేవి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం రంగయ్య బాబును, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

  • ‘వైఎస్సార్ ఆశయాలను జగన్ పుణికిపుచ్చుకున్నారు’

    ఎన్టీఆర్: చెరగని చిరునవ్వుతో పాలన అందించిన గొప్ప పాలకులు వైఎస్సార్‌ అని వైసీపీ గుంటూరు పార్లమెంట్‌ పరిశీలకులు పోతిన మహేష్‌ కొనియాడారు. మంగళవారం వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా మహేష్‌ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పాలనను గుర్తుచేసుకున్నారు. ‘ప్రతీ కుటంబం వైఎస్సార్ వల్ల లబ్ధి పొందారన్నారు. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ పుణికిపుచ్చుకున్నారని తెలిపారు.

  • సామాజిక సేవకుడు పవన్ కల్యాణ్: గుడివాడ ఎమ్మెల్యే

    కృష్ణా: కూటమి శ్రేణుల్లో స్ఫూర్తి నింపుతూ సామాజిక సేవకుడిగా, ప్రజా నాయకుడిగా పవన్ కల్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు ఎనలేనివని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. గుడివాడ పట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్యఅతిథిగా పాల్గొని అభిమానులు, జనసైనికులను ఉత్సాహపరిచారు.

  • పారిశుధ్య కార్మికులకు చీరల పంపిణీ

    కృష్ణా: గన్నవరంలో డిప్యుటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి శివశంకర్, రాష్ట్ర నాయకులు మండలి రాజేష్‌లు పండ్లు పంపిణి చేశారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ కార్యాలయం సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు  చీరలు పంపిణీ చేశారు.

  • నాగాయలంకలో రక్తదాన శిబిరం

    కృష్ణా: దివంగత మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాగాయలంకలో వైసీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమ నిర్వాహకుల అభ్యర్థన మేరకు, తక్షణమే అక్కడికి ఒక మోటార్‌ను అందించారు.

  • పులిగడ్డలో పేదలకు దుస్తుల పంపిణీ

    కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. జనసేన నాయకులు మండలి దయాకర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.