Locations: Krishna

  • పేదలకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన షేక్ బాబా వలికి రూ. 60,000 విలువైన ఎల్ఓసీ(లెటర్ ఆఫ్ క్రెడిట్)ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. బాబా వలి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సహాయం ఆయన వైద్య అవసరాలకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. పేదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సౌమ్య స్పష్టం చేశారు.

  • ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

    ఎన్టీఆర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. జి.కొండూరు, మైలవరం, వెల్వడం గ్రామాల్లో కేకులను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలనే దృఢమైన ఆశయంతో జనసేన పార్టీ నెలకొల్పి పవన్ కళ్యాణ్ విస్తృతంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

  • జల్‌జీవన్ మిషన్‌లో వెనుకబడ్డాం : సత్యకుమార్

    ఎన్టీఆర్: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘సంపూర్ణత అభియాన్’ సత్కార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురిని వారు సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా నోటి, గర్భాశయ, సర్వైకల్ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామన్నారు. జల్‌జీవన్ మిషన్‌లో మనం వెనుకబడ్డామని.. ఐదేళ్లలో గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

  • వేంకటేశ్వర థియేటర్‌లో పవన్ బర్త్ డే వేడుకలు

    కృష్ణా: అవనిగడ్డ వేంకటేశ్వర థియేటర్‌లో చిరంజీవి యువత జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పికట్ల తారక మస్తాన్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ విచ్చేసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

  • విక్కుర్తి కార్యాలయంలో పవన్ బర్త్ డే వేడుకలు

    కృష్ణా: అవనిగడ్డలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విక్కుర్తి వీర రాఘవయ్య ఫౌండేషన్ ఛైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు కార్యాలయంలో విక్కుర్తి రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా పలువురు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను కొనియాడారు.

     

     

  • ‘YSR ఆశయాలకు అనుగుణంగా అడుగులు’

    కృష్ణా: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు శశిభూషణ్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్ పేద ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచేలా చేశాయన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా కొడాలి నాని నాయకత్వంలో వైసీపీ నాయకులు ముందుకు సాగుతామన్నారు.

  • ప్రకృతి సోయగాలతో కట్టిపడేస్తున్న జలపాతాలు

    ఎన్టీఆర్: కొండపల్లి ఖిల్లాపై ఉన్న కొండల్లో సహజ సిద్ధంగా పుట్టిన జలపాతాలు పచ్చనిచెట్ల నడుమ కొండల పైనుంచి క్రిందికి జాలువారుతూ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పర్యాటక శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి పర్యాటకులను ఖిల్లాపైకి అనుమతిస్తే ఖిల్లా మరింత పర్యాటక ప్రాంతంగా వర్ధిల్లుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. జలపాతాలను దగ్గరికెళ్లి సందర్శించేందుకు సరైన రహదారి లేక దూరం నుంచే చూసి పర్యాటకులు సంతోషపడుతున్నారు.

  • తెలంగాణ మంత్రికి మచిలీపట్నంలో ఘన స్వాగతం

    కృష్ణా జిల్లాలో తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. మచిలీపట్నం నేషనల్ కాలేజీ గ్రౌండ్‌లో హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గాన చల్లపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లారు. ఆయనకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డిఓ కె.స్వాతి, చల్లపల్లి మాజీ ఎంపీపీ ఎర్రగడ్డ సోమశేఖర్ ప్రసాద్, సీనియర్ టీడీపీ నాయకులు పోలింగ్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

  • పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన సౌమ్య

    కృష్ణా: ప్రజా నాయకులు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

  • YSR సంక్షేమానికి చిరునామా: మొండితోక అరుణ్

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం మండలం గొట్టుముక్కలలో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పాలన గుర్తుచేసుకొని వైయస్సార్ విగ్రహానికి గ్రామ నాయకులుతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. YSR పాలనలో దేశ చరిత్రలో లేని సంక్షేమ పాలన అమలు చేశారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.