ఎన్టీఆర్: విజయవాడలోని గొల్లపూడిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Locations: Krishna
-
గొట్టుముక్కలలో పవన్ జన్మదిన వేడుకలు
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వర్గీయ నందమూరి హరికృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు ఆధ్వర్యంలో వేడుకలకు మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోగంటి బాబు కేకు కట్ చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
-
మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయరాణి మృతి
ఎన్టీఆర్: వీరులపాడు మండలం చౌటపల్లి టీడీపీ సీనియర్ నాయకులు గురిజాల అజయ్ కుమార్ భార్య మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గురిజాల విజయ రాణి మంగళవారం మృతిచెందారు. ఆమె అంతియ యాత్ర కార్యక్రమం బుధవారం ఉదయం చౌటపల్లిలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
-
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రింగ్ సెంటర్‌లో YSR వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బ్యానర్‌ను తొలగించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు చేయాలని జనసేన శ్రేణులు సిద్ధమయ్యాయి. దీంతో వారిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. YSR బ్యానర్ పైన పవన్ కల్యాణ్ బ్యానర్ పెట్టి కార్యక్రమం నిర్వహించారు.
-
అవనిగడ్డలో పవన్ పుట్టినరోజు వేడుకలు
కృష్ణా: అవనిగడ్డలోని మండల టీడీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కూటమి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాధ్‌ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాజనాల వీరబాబు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో పవన్ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
-
YSR అంటేనే సంక్షేమం, అభివృద్ధి: దేవినేని
ఎన్టీఆర్: విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద మాజీ సీఎం వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వైఎస్‌ఆర్ పాలనను గుర్తుచేశారు. YSR పేరు గుర్తొస్తేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను YSR ఆదుకున్నారని, YSR పాలనను ఐకాన్ లాగా తీసుకొని ప్రక్క రాష్ట్రాల వారు పాలన చేస్తున్నారన్నారు.
-
విజయవాడలో వైఎస్‌ఆర్ ఘన నివాళులు
ఎన్టీఆర్: విజయవాడలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజతదితరులు పాల్గొన్నారు.
-
ఏసీబీ కార్యాలయానికి సంజయ్ తరలింపు
ఎన్టీఆర్: మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) ఎన్.సంజయ్‌ను గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏపీ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సంజయ్‌ను జిల్లా జైలు నుంచి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు.
-
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన తన్నీరు
ఎన్టీఆర్: వత్సవాయి మండలం మంగోల్లు గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆయన విగ్రహానికి గ్రామ నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకొని స్మరించుకున్నారు.
-
కాజ్‌వే పై లారీ బోల్తా.. డ్రైవర్ సురక్షితం!
ఎన్టీఆర్: వత్సవాయి మండలం లింగాల కాజ్‌వే పై నుంచి వరద నీటిలో లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి జగ్గయ్యపేట బొగ్గుల లోడుతో వెళ్తున్న లారీ నీటిలో బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడిపినట్లు స్థానికుల సమాచారం.