Locations: Krishna

  • YSR అంటేనే సంక్షేమం, అభివృద్ధి: దేవినేని

    ఎన్టీఆర్: విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద మాజీ సీఎం వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ వైఎస్‌ఆర్ పాలనను గుర్తుచేశారు. YSR పేరు గుర్తొస్తేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను YSR ఆదుకున్నారని, YSR పాలనను ఐకాన్ లాగా తీసుకొని ప్రక్క రాష్ట్రాల వారు పాలన చేస్తున్నారన్నారు.

  • విజయవాడలో వైఎస్‌ఆర్ ఘన నివాళులు

    ఎన్టీఆర్: విజయవాడలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజతదితరులు పాల్గొన్నారు.

     

  • ఏసీబీ కార్యాలయానికి సంజయ్ తరలింపు

    ఎన్టీఆర్: మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) ఎన్.సంజయ్‌ను గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏపీ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సంజయ్‌ను జిల్లా జైలు నుంచి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు.

  • వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన తన్నీరు

    ఎన్టీఆర్: వత్సవాయి మండలం మంగోల్లు గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆయన విగ్రహానికి గ్రామ నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకొని స్మరించుకున్నారు.

  • కాజ్‌‌వే పై లారీ బోల్తా.. డ్రైవర్ సురక్షితం!

    ఎన్టీఆర్: వత్సవాయి మండలం లింగాల కాజ్‌వే పై నుంచి వరద నీటిలో లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి జగ్గయ్యపేట బొగ్గుల లోడుతో వెళ్తున్న లారీ నీటిలో బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడిపినట్లు స్థానికుల సమాచారం.

  • సుబ్రహ్మేణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి

    కృష్ణా: మోపిదేవిలో కొలువైన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం దర్శించుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన మంత్రికి ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలు పోసి, మొక్కుబడులు చెల్లించుకున్నారు.

  • కత్తివెన్నులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

    కృష్ణా: కృత్తివెన్ను మండలం గాంధీ నగరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభు ప్రసాద్, పార్టీ మండల మహిళా కన్వీనర్ ఝాన్సీ, వైసీపీ నాయకులు విశ్వేశ్వరరావు, ఈశ్వర్ లాల్, పూర్ణచంద్రరావు, బిక్షారావు, వెంకటసుబ్బమ్మలు పాల్గొన్నారు.

  • కొండల మధ్య జాలువారుతున్న జలపాతం

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గొట్టుముక్కల శివారు అటవీ ప్రాంతంలో కొండల మధ్య స్వయంభుగా వెలిసిన శ్రీమద్దులమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మికతకు, ప్రకృతి రమణీయతకు నిలయంగా మారింది. ఆలయ సమీప కొండలపై నుంచి జాలువారే జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. కానీ ఆలయానికి వచ్చే రోడ్డు మార్గం అధ్వానంగా ఉందని, రహదారి అభివృద్ధి చేసి ఆలయం వద్ద వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

     

  • అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

    ఎన్టీఆర్: విజయవాడ పంట కాలువ రోడ్డులో సోమవారం రాత్రి సుమారు 35-40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పటమట పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని వారు కోరారు.

     

     

  • ‘మైనర్లకు వాహనమిస్తే.. జరిమానా తప్పదు’

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నంలో రెండోరోజు కొనసాగిన వాహన తనిఖీలలో లైసెన్స్ లేకుండా బైకులు నడుపుతూ మైనర్లు పట్టుబడ్డారు. వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మొదటి తప్పిదమైతే కౌన్సెలింగ్‌తో వదిలేస్తామని, పునరావృతమైతే జరిమాణాలు, జైలు శిక్షలు, క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. మితిమీరిన వేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.