Locations: Krishna

  • చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

    కృష్ణా: చికిత్స పొందుతూ రోడ్డు ప్రమాద బాధితుడు మృతిచెందాడు. గత నెల 5న కంకిపాడు మండలం పునాదిపాడు రోడ్డులో బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలపాలైన గూడవల్లికి చెందిన కొలుసు సుబ్బారావు (58) సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

  • ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

    కృష్ణా: ఘంటసాల గ్రామంలోని శ్రీ జలధీశ్వరస్వామి ఆలయం ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి చల్లపల్లికి చెందిన మెహెర్ నృత్య నికేతన్ గురువు దాలిపర్తి మెహెర్ దుర్గా నరసింహారావు ఆధ్వర్యంలో 22 మంది విద్యార్థినీలు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం రిటైర్డ్ హెడ్‌మాస్టార్ దంపతులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

  • చికిత్స పొందుతూ యువకుడు మృతి

    కృష్ణా: చల్లపల్లికి చెందిన రోడ్డు ప్రమాద క్షతగాత్రుడు షేక్ అమానుల్లా షరీఫ్(30) సోమవారం విజయవాడ ప్రభుత్వసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆగస్టు 20వ తేదీన చల్లపల్లి నుంచి కాలినడకన తిరిగి వస్తుండగా రాత్రివేళ NH-216పై ఘంటసాల మండలం లంకపల్లి వద్ధ బైకు ఢీకొట్టింది. తలకు తీవ్రగాయంతో విజయవాడలో చికిత్స పొందుతూ షరీఫ్ మృతిచెందాడు. ఈఘటనపై షరీఫ్ తల్లి చల్లపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

     

  • కరెన్సీ అలంకరణలో వినాయకుడు

    కృష్ణా: పెడన పట్టణంలోని 13వ వార్డు దిక్కులకాలనీలో ఏర్పాటు చేసిన వినాయకునికి బాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష రూపాయల కరెన్సీతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు.  బొజ్జ గణపయ్యని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు చూసి ఆనందం వ్యక్తం చేశారు.

  • ‘ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి’

    ఎన్టీఆర్: ఈనెల 15వ తేదీన విజయవాడలోని రాష్ట్ర లేబర్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. మైలవరం పట్టణంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీసులో కార్మికులతో సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. సంక్షేమ బోర్డు పునఃప్రారంభించి క్లైములు, ఐడీ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.

  • నిజాయితీ, నిస్వార్ధంగా ఉద్యోగులు సేవలు అందించాలి: ఎమ్మెల్యే

    కృష్ణా: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు నిజాయితీ, నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పురపాలక సంఘంలో నలుగురు ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు… ఐదుగురు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాలను పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అందజేశారు. ప్రజలకు మంచి చేయడమే మనందరి లక్ష్యం కావాలని కోరారు.

  • పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య

    ఎన్టీఆర్: పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. వీరులపాడు మండలం, జమ్మవరం గ్రామంలో సోమవారం నాడు జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

     

  • ఇరిగేషన్ డైరెక్టర్‌గా చల్లపల్లి సర్పంచ్

    కృష్ణా: చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరుగా నియమితులయ్యారు. సోమవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణకుమారి టీడీపీ తెలుగు మహిళ మచిలీపట్నం పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో కృష్ణకుమారి చల్లపల్లి మండల జడ్పీటీసీ సభ్యురాలిగా సేవ చేశారు.

  • సాక్షి ప్రతులను తగులబెట్టిన కూటమి నేతలు

    కృష్ణా: రాష్ట్రంలో వైసీపీ, ఈపార్టీ పత్రిక సాక్షి అబద్ధాలు ప్రచురిస్తోందని అవనిగడ్డలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు నేతృత్వంలో కూటమి నేతలు సాక్షి ప్రతులను తగులబెట్టారు. వైసీపీ హయాంలో ప్రజాధన అడ్డగోలు చేసిన నేతలు ఇప్పుడు డీఎస్సీ, పెన్షన్‌లపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పేదలసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సాక్షి తప్పుడు వార్తలువేస్తోందని విమర్శించారు. బుద్ధిమార్చకపోతే పత్రికను ఎక్కడా పెట్టకుండా చేస్తామని హెచ్చరించారు.

  • బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా

    ఎన్టీఆర్: విజయవాడ కలెక్టరేట్ వద్ద బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. APUCF కన్వీనర్ సిహెచ్ బాబురావు ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశకు వినతిపత్రం సమర్పించారు. రూ.80వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టుపై అత్యుత్సాహం చూపించి.. లక్షలాది మందిని ముంచే బుడమేరు ముంపుపై నిర్లక్ష్యం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.