Locations: Krishna

  • బస్సుల రద్దీ.. ప్రయాణికులకు తప్పని కష్టాలు.!

    ఎన్టీఆర్: కంచికచర్ల బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం ఎదురుచూస్తూ నిలబడి, ఎక్కే సమయంలో ఒకరినొకరు తోసుకోవడం, కిక్కిరిసిన వాతావరణంలో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడూ బస్సుల కొరత వల్ల గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • గణనాథుని లడ్డూ @రూ.61 వేలు

    ఎన్టీఆర్: పశ్చిమ ఇబ్రహీంపట్నం తండాలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి నిమజ్జన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గణేష్ లడ్డూ వేలంపాటలో బానావత్ శీను పాల్గొని రూ.61 వేలకు లడ్డు దక్కించుకున్నాడు. మండప కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంతాలతో లడ్డును విజేతకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

     

  • నూజివీడు మండలంలో పెన్షన్ల పంపిణీ

    ఏలూరు: నూజివీడు మండలంలో సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగింది. గ్రామంలోని వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి పెన్షన్ దారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు అందజేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • మెడికల్ కిట్లు, నిత్యవసర సరుకులు పంపిణీ

    కృష్ణా: పెడన పట్టణంలోని ది లార్డ్ ఆఫ్ వరల్డ్ చర్చ్, దీపం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ రెవరెండ్ జాన్‌డానియల్ కుమారుడు మౌజత్ విలియం బర్త్‌డే సందర్భంగా 100మంది పేదలకు, వృద్ధులకు మెడికల్ కిట్లు, నిత్యవసరాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పేదల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. అనంతరం రెవరెండ్ దేవదానం, పాస్టర్ మనోహరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

     

  • ప్రిన్సిపాల్‌ను సన్మానించిన ఎమ్మెల్యే మండలి

    కృష్ణా: గురుకులాల్లో చదివిన ఎంతోమంది పేద విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నత అధికారులు అయ్యారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డ మండలం పులిగడ్డలోని ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఎస్‌టీపీ కుమార్ ఉద్యోగ విరమణ సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.

     

  • వీఆర్వోల సంఘం నూతన కమిటీ ఎన్నిక

    కృష్ణా: చల్లపల్లి మండల వీఆర్వో సంఘం నూతన కమిటీ అధ్యక్షునిగా లీల ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చల్లపల్లి రెవెన్యూ కార్యాలయ ఆవరణలోని వీఆర్వో గోపాలకృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడిగా అమలేశ్వరరావు, ట్రెజరర్ ప్రతిమ, సెక్రటరీ రవిబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో సంఘంఅధ్యక్షుడిగా పనిచేసిన కిరణ్ బాధ్యతలను నూతన అధ్యక్షుడు లీలాప్రశాంత్‌కు అప్పగించారు. నూతన కమిటీసభ్యులకు సహచర వీఆర్వోలు శుభాకాంక్షలు తెలియజేశారు.

     

  • అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి: ఎమ్మెల్యే

    కృష్ణా: రాష్ట్ర అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే మండల ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 30ఏళ్ల పూర్తయిన సందర్భంగా కూటమినేతలతో కలిసి అవనిగడ్డలో కార్యక్రమం నిర్వహించారు. ఐటీ, సంస్కరణలతో ఉమ్మడి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కట్టింగ్ చేశారు.

  • సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపిక.. ఎప్పుడంటే!

    కృష్ణా: జిల్లా సాఫ్ట్ టెన్నిస్ సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు ఈనెల 7న నిర్వహిస్తున్నామని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డి.దిలీప్ కుమార్ తెలిపారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలి. ఎంపికైన జట్లు సెప్టెంబర్ 27, 28న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయి.

  • బుడమేరు పాపం మీది కాదా? : వెల్లంపల్లి

    ఎన్టీఆర్: బుడమేరు ఘటన జరిగి ఏడాదైనా బాధితులకు న్యాయం జరగలేదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ ‘‘మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు ప్రక్షాళన చేస్తున్నామంటూ హడావుడి చేశారేతప్ప మళ్లీ కనిపించలేదు. ఆ పది రోజులపాటు బోయపాటి సినిమాను తలపించేలా ప్రభుత్వం హడావుడి చేసింది. బుడమేరు పాపం మీది కాదా? 40మంది మృతుల కుటుంబాలపై మీకు బాధ్యత లేదా?’’ అని ప్రశ్నించారు.

  • రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే సౌమ్య

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం, జమ్మవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌గా బొజ్జ వీరయ్య సోమవారం నాడు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని వీరయ్యని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని, విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సహకారం అందించి వ్యవసాయరంగంలో సానుకూల మార్పులు తేవాలని ఎమ్మెల్యే కోరారు.