Locations: Krishna

  • సుధాకర్ రెడ్డికి సీపీఐ నేతల ఘన నివాళులు

    ఎన్టీఆర్: సీపీఐ మాజీ ఆల్ ఇండియా కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మరణానికి విస్సన్నపేట మండల కమిటీ సంతాప సభ నిర్వహించింది. మండల కార్యదర్శి త్యాగరాజు మాట్లాడుతూ.. నల్గొండలో జన్మించి, ప్రజాపోరాటాలతో ఎంపీ, రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన ఆయన సీపీఐ జెండా నీడలోనే మరణించారని, ఆయన మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

     

  • బంగారు కుటుంబానికి జీవనోపాధి

    ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ4 పథకం కింద చందర్లపాడు మండలం ముప్పాళ్లలోని బంగారు కుటుంబానికి చెందిన కోట విల్సన్ రావు కుటుంబానికి జీవనోపాధి నిమిత్తం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులమీదుగా ఆటో అందజేశారు. కేసీపీ సిమెంట్స్ సంస్థ మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ..ఎమ్మెల్యే చేతులమీదుగా ఆటో తాళాలు అందించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా మార్చేందుకే పీ4 ప్రవేశపెట్టినట్లు ప్రముఖుల తెలిపారు.

     

  • CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత

    ఎన్టీఆర్: ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్ధిక సాయాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మండల కేంద్రమైన రెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. తాజాగా 29 మందికి రూ.12.25లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు పేర్కొన్నారు.

     

  • విజేతలకు బహుమతులు ప్రదానం

    ఎన్టీఆర్: వినాయక చవితిని పురస్కరించుకుని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రామికనగర్‌లో కేజీఎఫ్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు కౌన్సిలర్, వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు సోమవారం బహుమతులు అందజేశారు. ప్రజల మన్ననలు పొందుతున్న యూత్ సభ్యులను అభినందించి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అన్న సంతర్పణను ప్రారంభించారు.

     

  • పింఛన్లు ప్రతి కుటుంబానికి భరోసా

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ జరిగింది. కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టి బాబు, ఇబ్రహీంపట్నం సహకార పరపతి సంఘ ఛైర్ పర్సన్ కోయా నెహ్రూ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతినెల అందించే పింఛన్లు ప్రతి కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నాయన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.

     

  • వంతెనలు శిథిలాల్లో.. ప్రాణాలు గుప్పిట్లో

    ఎన్టీఆర్: జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో బుడమేరు వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. అధికారులు వివరాల ప్రకారం, ఉమ్మడి కృష్ణాలో 424ఆర్&బి వంతెనలున్నాయి. వాటిలో 63ప్రమాదకంగా ఉన్నట్లు తేలింది. ప్రధానంగా జగ్గయ్యపేట, జి కొండూరు, నందిగామ, పెడన, పామర్రు, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం అవనిగడ్డ, తదితర మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. వంతెనల వాటిపై ప్రయాణించాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

  • తిరువూరులో 5న జాబ్ మేళా

    ఎన్టీఆర్: తిరువూరులో ఈనెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. స్థానిక వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో అమర్ రాజా కంపెనీ, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

  • నిరంతరం ప్రజా సేవాకై పోరాటం

    ఎన్టీఆర్: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఇంటింటికి వెళ్లి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో 30ఏళ్లు పూర్తయ్యాయని కొనియాడారు. 15సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. అధికారం లేనప్పుడు కూడా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

  • ఈయన హయాంలో అంతా మంచే: వెనిగండ్ల

    కృష్ణా: కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం సీఎం చంద్రబాబు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో చంద్రబాబు హయాంలో చూసామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో 30ఏళ్లు పూర్తవడంతో ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు మీడియా ముఖంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

  • పేద కుటుంబానికి అండగా..!

    ఎన్టీఆర్: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఓపేద కుటుంబానికి బంగారు కుటుంబంలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ ఆటోని అందించారు. కెసీపీ సిమెంట్ వారి ఆధ్వర్యంలో కోట శంకర్ కుటుంబాన్ని దత్తత తీసుకొని ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం నందిగామలోని రెవెన్యూ కార్యాలయంలో ఆటోని బహుకరించారు.  జిల్లాలో దాదాపుగా 70వేల మందిని గుర్తించి, వారికి చేయూతనందించే విధంగా ముందుకెళ్తామని కలెక్టర్ పేర్కొన్నారు.