Locations: Krishna

  • పింఛన్లు అందించిన మండలి

    కృష్ణా: అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సోమవారం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, పక్షవాత బాధితులు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.

  • గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాగిత

    కృష్ణా: పెడన నియోజకవర్గంలోని నందమూరులో యువత ఏర్పాటు చేసిన వినాయకుడిని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిటీ తరఫున ఎమ్మెల్యేను శాలువాతో సత్కారించారు. యువత చేసిన వినాయక మహోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని గణపతిని ఎమ్మెల్యే ప్రార్థించారు.

  • అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందుతుంది: ఎమ్మెల్యే

    కృష్ణా: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడ పట్టణం 11వ వార్డులోని లబ్ధిదారులకు పింఛన్లను ఎమ్మెల్యే సోమవారం ఉదయం పంపిణీ చేశారు. వార్డులోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే..పింఛన్ నగదును వారికి అందజేశారు. లబ్ధిదారులతో, పాటు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

  • ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే

    కృష్ణా: పెడన మండలం నందమూరులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్వయంగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి నెలా పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని లబ్ధిదారులను ఆరా తీశారు. ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

  • అర్హులైన ఒక్కరి పింఛన్ కూడా తొలగించలేదు: సర్పంచ్

    కృష్ణా: కూటమి ప్రభుత్వంలో అర్హులైన ఒక్కరి పింఛన్ కూడా తొలగించలేదని చల్లపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణకుమారి అన్నారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆమె పంపిణీ చేశారు. చల్లపల్లి నారాయణరావు నగర్, ఎస్టీ కాలనీ, ఎస్సీ కాలనీలకు వెళ్లి దివ్యాంగులు, పక్షవాత బాధితులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు అందచేశారు. పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, గ్రామ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

  • జగ్గయ్యపేటలో ‘భారత్ పశుధన్’ ప్రారంభం

    ఎన్టీఆరర్: జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ‘భారత్ పశుధన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసం, పెయ్య దూడలు మాత్రమే పుట్టే వీర్యాన్ని(సెమెన్) పంపిణీ చేశారు. రూ.300 విలువైన ఈసెమెన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.150, కృష్ణా మిల్క్ యూనియన్ రూ.100సబ్సిడీ ఇవ్వడంతో రైతులకు కేవలం రూ.50కే లభిస్తుంది. గతంలో రూ.500 ఉన్న సెమెన్ ఇప్పుడు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.

     

  • మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

    AP : మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ పేరుతో స‌న్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.

     

  • వినూత్నంగా వినాయక నిమజ్జనం

    కృష్ణా: చల్లపల్లి మండలం రామానగరంలో చిన్నారులు వినూత్నంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. ధనుష్, జ్ఞానశ్రీ, లక్షిత్, పూజిత, గణేష్, దుర్గ వంటి చిన్నారులు కలిసి తమ చేతులతోనే గణపతిని అందంగా అలంకరించి పూజలు చేశారు. ఐదు రోజుల తర్వాత ఆ బుజ్జి గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేశారు. చిన్నారుల భక్తి,ఆసక్తిని గ్రామస్ధులు అభినందించారు. ఈనిమజ్జనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.

     

     

  • పింఛన్ల పంపిణీ.. వృద్ధుల అగచాట్లు!

    కృష్ణా: గూడూరు మండలం ఆర్వీపల్లిలో సోమవారం వృద్ధాప్య పింఛన్ల పంపిణీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికే చేర్చాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ గ్రామంలో ఆ పద్ధతి అమలు కాలేదు. వర్షం కురుస్తున్నా లబ్ధిదారులు స్వయంగా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

     

  • వాహనాల తనిఖీలు.. మైనర్లకు భారీ జరిమానా

    ఎన్టీఆర్: పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు రింగ్ సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా బైక్‌లు నడుపుతున్న ఐదుగురు మైనర్లను గుర్తించి భారీ జరిమానాలు విధించారు. అంతేకాకుండా వారి తల్లిదండ్రులను పిలిపించి మైనర్లకు కౌన్సెలింగ్ చేసి వాహనాలు అందజేశారు.