ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ లక్ష్మిషా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Locations: Krishna
-
నందిగామ డివిజన్‌లో నమోదైన వర్షపాతం వివరాలు
ఎన్టీఆర్: నందిగామ డివిజన్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 వరకు 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీరులపాడులో 28.6 మి.మీ. వర్షం కురిసింది. కంచికచర్లలో 12.0 మి.మీ, నందిగామలో 8.6 మి.మీ, పెనుగంచిప్రోలులో 8.6 మి.మీ, జగ్గయ్యపేటలో 4.8 మి.మీ, చందర్లపాడులో 5.2 మి.మీ, సగటు వర్షపాతం 10.2 మి.మీగా నమోదైంది. మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని జిల్లా కలెక్టర్ లక్ష్మి షా తెలిపారు.
-
రెడ్డిగూడెంలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఏవో శ్రీనివాసరావు, ఆర్ఏ గంధం పుల్లయ్య, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒక షాపులో అవకతవకలు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. రికార్డులు సవ్యంగా నిర్వహించకపోయినా, ఎరువులు బ్లాక్ చేసినా చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు.
-
సిద్ధి బుద్ధి గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
కృష్ణా: గుడివాడ పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం శ్రీ సిద్ధి బుద్ధి గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల 7వ రోజు మంగళవారం శ్రీ నాట్య గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ ఛైర్మన్ రాజేష్, ఈవో వాసు తెలియజేశారు.
-
కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో భారీ వర్షం
ఎన్టీఆర్: కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
-
గణపతికి కమిషనర్ ప్రత్యేక పూజలు
ఎన్టీఆర్: చందర్లపాడు మండలం తుర్లపాడు బొడ్రాయి సెంటర్‌లో జరిగిన గణపతి పూజా కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ కమిషనర్ లవరాజు దంపతులు పాల్గొన్నారు. గ్రామ నాయకులు దాసర ఏసుప్రభు, తదితరులు కూడా భక్తిభావంతో భాగస్వాములయ్యారు.
-
పనిచేసే వారికి ప్రశంసలే అవార్డులు: ఆర్డీవో
కృష్ణా: పనిచేసే వారికి ప్రజల ప్రశంసలే అవార్డులని, ప్రత్యేక గుర్తింపుల కోసం ఆరాటపడరని అలాంటి వారిలో వీఆర్వో గొల్లపూడి రాజేంద్ర కుమార్ ముందు వరుసలో ఉంటారని మచిలీపట్నం ఆర్డీవో స్వాతి కొనియాడారు. వీఆర్వో పదవీ విరమణ సందర్భంగా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. డీఆర్ఓ వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది.
-
పదవి విరమణ పొందిన సెక్రటరీకి సన్మాన సభ
కృష్ణా: కోడూరు వైసీపీ మండల కన్వీనర్ మాధవరావు అల్లుడు దుర్గా ప్రసాద్ గుడ్లవల్లేరు మండల పంచాయతీ సెక్రటరీగా చేస్తూ పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా కొండాలమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన సన్మాన సభలో దివి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ నరసింహారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు నాగరాజు, నాగరాజు, చందు, మణికంఠ, తాతయ్య, సోమేశ్వరరావు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
-
నూజివీడులో ఘనంగా గణనాథుడి నిమజ్జనం
ఏలూరు: నూజివీడు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కార్యాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా నిలబెట్టిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. మొదటిగా లడ్డు పాట నిర్వహించగా పట్టణంలోని ప్రముఖ జ్యూలరీ సంస్థ అధినేత అచ్చెశ్వరరావు రూ.31వేలకు దక్కించుకున్నారు. అనంతరం పట్టణ ప్రముఖ వీధుల గుండా సంబరం సాగగా భక్తులకు ప్రసాదాలు పంచి తమ భక్తిని చాటారు.
-
‘సాంకేతిక అభివృద్ధి మానవ సంక్షేమానికే ఉపయోగపడాలి’
ఎన్టీఆర్: జన విజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభ కొండపల్లి క్రాంతి హైస్కూల్లో ఆదివారం జరిగింది. జెవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్ మాట్లాడుతూ.. సాంకేతిక అభివృద్ధి మానవ సంక్షేమానికి ఉపయోగపడాలి.. తప్ప వినాశనానికి కాదని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో జెవీవీ అవగాహన పెంచుతుందన్నారు.