ఎన్టీఆర్: మైలవరంలోని బైపాస్ ఫీడర్‌లో విద్యుత్ మరమ్మతులు దృష్ట్యా సోమవారం విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సూరిబాబుపేట, బస్టాండ్ ఏరియా, కోత మిషన్ ఏరియా, ఎండీఓ ఆఫీస్ రోడ్డు, రాజాపేట, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్, మాలపల్లి, చంద్రబాబు నగర్, నూజివీడు రోడ్డు, బైపాస్ రోడ్, దేవుని చెరువు, ఈ ప్రదేశాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.
Locations: Krishna
-
కొండపల్లి జాలువారే సోయగం..!
ఎన్టీఆర్: ప్రకృతి సోయగాలు చూడాలంటే రెండు కళ్ళ చాలవు. తాజా భారీ వర్గాలకు కొండపల్లి అటవీ ప్రాంతంలో జలపాతాలు ఏర్పడ్డాయి. అడవులోని గుంతలు, చెరువులు నిండి పొంగిపొర్లే క్రమంలో ఎత్తయిన కొండలపై నుంచి నీరు జాలువారుతున్న తీరు ఆకట్టుకుటుంది. కొండపల్లి నుంచి టీవీ టవర్‌కు వెళ్లే మార్గంతో పాటు సత్తెమ్మలోయ, మూలపాడు సీతాకోక చిలుకలవనం, అడవీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణాల్లో ఇవి దర్శనమిస్తున్నాయి.
-
‘సేనాని జన్మదినోత్సవాలు విజయవంతం చేయండి’
కృష్ణా: అవనిగడ్డలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌కళ్యాణ్ జన్మదినోత్సవాలను విజయవంతం చేయాలని యువనాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2న నాగాయలంకలో మెగా రక్తదాన శిబిరం, వస్త్రదానం, ప్రతిభావంతుల అభినందన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. సేవా తత్పరులు, మెగా అభిమానులు, కుటమి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
-
జన విజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఎన్టీఆర్: జన విజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభ అనంతరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా వి.మురళీ మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఎల్.గంగాధర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ వి.రవీంద్ర, డాక్టర్ ఎం.సీతారామారావు, కోశాధికారిగా భాను ప్రసాద్, ఉపాధ్యక్షులుగా పి.కామేశ్వరరావు, వెలగ శ్రీనివాస్, ఎం.హరికృష్ణ, జి.మల్లికార్జున రెడ్డి, కార్యదర్శులుగా ఎం.రాంప్రదీప్, బి.రవి, జె.సుబ్బారావు, ఎస్.డి.మస్తాన్ వలీ ఎన్నికయ్యారు.
-
త్వరలో విజయవాడ ప్రీమియర్ లీగ్
ఎన్టీఆర్: క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజయవాడ ప్రీమియర్ లీగ్ (వీపీఎల్) ఏర్పాటు చేయనున్నామని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ తెలిపారు. వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఫౌండేషన్ క్రీడాకారులకు అండగా ఉంటుందని, దసరా ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ నుంచి వీపీఎల్ నిర్వహిస్తారని ప్రకటించారు.
-
‘సమాజంలో పేదరిక నిర్మూలన విద్యతోనే సాధ్యం’
కృష్ణా: సమాజంలో పేదరిక నిర్మూలన విద్యతోనే సాధ్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ విద్యార్థులకు లాప్ టాప్స్, యూనివర్సిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ సర్వ మతాలు దాతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.
-
కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో భారీ వర్షం
ఎన్టీఆర్: కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీటమట్టం అయ్యింది. స్థానికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
-
వారు గ్రామ దేవుళ్లతో సమానం: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: నందిగామ డివిజన్ ఏరియా కమిటీ, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, అమ్మ డయాగ్నస్టిక్స్ సహకారంతో పట్టణంలోని రైతుపేట ఓసి క్లబ్‌లో ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు పల్లె ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ గ్రామ దేవుళ్లతో సమానమని ప్రశంసించారు.
-
‘గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయం’
ఎన్టీఆర్: వీరులపాడు మండలం జమ్మవరంలో నిర్వహించిన కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ పోటీల్లో 20 జట్లు పాల్గొనగా, విజేతలుగా నిలిచిన స్థానిక యువకులను ఆమె అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ హామీ ఇచ్చారు.
-
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కృష్ణా: సెప్టెంబర్ 1న మచిలీపట్నం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక-మీకోసం’ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ప్రజల ఫిర్యాదులను మండల, మున్సిపల్ స్థాయిలలో స్వీకరించేందుకు వికేంద్రీకరించినట్లు వెల్లడించారు. అర్జీదారులు సమీప మండల లేదా మున్సిపల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు సమర్పించవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.