Locations: Krishna

  • పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: రాము

    ఎన్టీఆర్: రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరుకు చెందిన మట్టకొయ్య రాము మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు అందాయి. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాము అన్నారు.

  • వృద్ధులకు ఆలస్యంగా రేషన్ పంపిణీ?

    ఎన్టీఆర్: వృద్ధులకు ఈనెలలో రేషన్ పంపిణీ ఆలస్యంగా జరుగుతోంది. సాధారణంగా నెలలో మొదటి 4రోజులు వృద్ధులకు రేషన్ అందిస్తారు. అయితే ఈ నెల కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సర్వర్ సమస్యల కారణంగా 2రోజులు ఆలస్యమైందని డీలర్లు చెబుతున్నారు. నేటితో వృద్ధులకు రేషన్ పంపిణీ గడువు ముగుస్తుండటంతో, షాపుల వద్ద ప్రజలు క్యూకట్టారు. అయితే, పంపిణీ కొనసాగుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

  • మైలవరంలో అడుగడుగునా ఆపదే..!

    ఎన్టీఆర్: మైలవరం నుంచి చంద్రాల వరకు ఉన్న రహదారి అడుగడుగునా భారీ గుంతలతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా మైలవరం రింగ్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని మట్టి రోడ్డును తలపిస్తోంది. దీంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

  • ‘శాస్త్రీయబద్ధమైన విద్య కోసం యూటీఎఫ్ పోరాటం’

    ఎన్టీఆర్: మైలవరంలోని పెన్షనర్స్ భవన్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) మధ్యంతర జిల్లా కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించడం,శాస్త్రీయబద్ధమైన విద్య కోసం యూటీఎఫ్ పోరాటం చేస్తుందని వారు తెలిపారు.

  • మరోసారి బయటపడిన NTTPSలో సెక్యూరిటీ లోపం

    ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్‌టీటీపీఎస్‌లో సెక్యూరిటీ లోపం మరోసారి బయటపడింది. ఎవరినైనా అనుమతించాలంటే 100 రూల్స్ చూపించే సెక్యూరిటీ సిబ్బందిని దాటి తాగిన లారీ డ్రైవర్ లోపలికి ప్రవేశించి, బూడిద రవాణా లారీ బోల్తా కొట్టింది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదాలను దాచే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అధికారుల సమాధానం కోసం వేచి చూడాల్సిందే.

  • మత సామరస్యానికి వేదికైనా వినాయక మండపం..!

    ఎన్టీఆర్: కొండపల్లి శ్రీనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా ముస్లిం సోదరులు హఫీజ్ ఫారుక్ ఖాద్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు అక్కల రామ్మోహన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి అన్నదానం చేశారు. కులమత బేధాలు లేకుండా స్థానికులు కలిసి భోజనాలు చేశారు. అక్కల గాంధీ మతం కన్నా మానవత్వం గొప్పదని, ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతను చాటుతాయని అన్నారు.

  • గణనాథుడికి మున్సిపల్ ఛైర్మన్ ప్రత్యేక పూజలు

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గణనాథుడి మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో వేడుకలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఆదివారం గ్రీన్లాండ్ వీధిలో అడితి కొండలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు. విజ్ఞేశ్వరుడి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  • నందిగామలో మెగా రక్తదాన శిబిరం

    ఎన్టీఆర్: నందిగామ క్లాత్ మర్చంట్ హాల్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహత్తరమైన సేవ అని, ఒక బిందువు రక్తం అనేక ప్రాణాలను రక్షిస్తుందని ఆమె అన్నారు. యువత, సేవాసంస్థల సహకారాన్ని ప్రశంసించి, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని సూచించారు.

  • విస్సన్నపేటలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

    ఎన్టీఆర్: విస్సన్నపేట టీచర్స్ కాలనీలోని వినాయక మండపంలో విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు, దేవాలయ కమిటీ డైరెక్టర్ కొత్తూరు ప్రసన్న, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి తాళ్ల వెంకట శ్రీనివాసరావు, ఓబీసీ జిల్లా కార్యదర్శి పిల్లి యలమందరావు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానంలో పాల్గొన్నారు.

  • వాసిరెడ్డి లక్ష్మిప్రసన్నను పరామర్శించిన ఎమ్మెల్యే

    ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో సీఎం రోడ్డు నివాసి వాసిరెడ్డి లక్ష్మి ప్రసన్న కాలు శాస్త్ర చికిత్స అనంతరం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుండగా, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. లక్ష్మి ప్రసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.