Locations: Krishna

  • కంచికచర్లలో ఘనంగా గణేషుడి పూజలు

    ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్‌లో శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో నందిగామ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెలగా వేణుబాబు, ప్రెస్‌క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రెస్ క్లబ్ సభ్యులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు కాకాణి సుమన్ పాల్గొన్నారు.

     

  • గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

    ఎన్టీఆర్: నందిగామ మునేటి తీరాన ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లను బీజేపీ సీనియర్ నాయకులు కేదార్నాథ్ శర్మ హిందూ జాగృతి సభ్యులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక క్రేన్‌ని కూడా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్, సీఐలకు విజ్ఞప్తి చేశారు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉందని, నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

     

  • తాగుబోతుల వీరంగం.. నడిరోడ్డుపై!

    కృష్ణా: తోట్లవల్లూరు మండలం యాకమూరులో మద్యంమత్తులో తాగుబోతులు వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 27న రాత్రి పాల ప్యాకెట్లు తీసుకొని ఇంటికెళ్తున్న ఉప్పు గోపి అనే వ్యక్తిని తాగుబోతులు అడ్డగించి దాడి చేశారు. అడ్డువచ్చిన భార్య, అక్క, మరోవ్యక్తిపై దాడికి తెగబడ్డారు. మహిళ అని చూడకుండా నడిరోడ్డపై నైటీ చింపి అవమానపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • సమస్య ఏదైనా.. వెన్నంటే కూటమి

    ఎన్టీఆర్: నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఆదివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయనిధి రూపంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతోమంది జీవితాలకు మేలు చేస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం వెన్నంటి నిలుస్తుందన్నారు.

     

  • ఆపరేషన్ బుడమేరు ఏమైంది? : దేవినేని అవినాష్

    ఎన్టీఆర్: బుడమేరు నష్టనివారణ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఏడాది క్రితం జరిగిన బుడమేరు ఘటన ఇప్పటికీ బెజవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందన్నారు. ‘ఆపరేషన్ బుడమేరు’ ఏమైందో మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. బుడమేరు కట్టపై పగలు కూర్చొని.. రాత్రి పడుకుంటే పరిష్కారం దొరుకుతుందా అని ప్రశ్నించారు.

  • రేపు నీటి సరఫరా బంద్

    ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో సెప్టెంబర్ 1వ తేదీన నీటి సరఫరా నిలివేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ సామ్రాజ్యం తెలిపారు. తూర్పు పరిధిలోని 5వ డివిజన్ 46 ఎంఎల్‌డీ నీటి ప్లాంట్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, సిబ్బందికి సహకరించాలని కోరారు.

     

  • మహిళలకు ఫ్రీ ట్రైనింగ్.. అప్లై చేయండి

    ఎన్టీఆర్: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు డొమిస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో మహిళలు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 8918951682 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

     

  • అడుగడుగునా ఆపదే..!

    ఎన్టీఆర్: కంచికచర్ల నుంచి మొగులూరు, ఎస్ అమరవరం వెళ్లే రహదారులు అడుగడుగునా భారీ గుంతలతో అధ్వానంగా మారాయి. ఇటీవల వచ్చిన వరదలకు రోడ్లు పలుచోట్ల భారీగా కోతకు గురయ్యాయి. వాహనదారులు నిత్యం ఆ రోడ్ల వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • ‘విజయవాడ ఉత్సవ్’.. మర్చిపోలేని విధంగా..!

    ఎన్టీఆర్: దసరా అంటే గుర్తొంచే విధంగా విజయవాడలో ఉత్సవాలకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో నగరంలోని పున్నమిఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానాల్లో అంతర్జాతీయ స్థాయిలో కార్నివాల్ తరహాలో వేడుకలను నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు జరిగే వేడుకల్లో హెలీకాఫ్టర్ రైడ్, గ్యాస్ ఏయిర్ బెలూన్స్‌లో విహారం, రోజుకో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వాహణకు సన్నాహాలు చేస్తున్నారట.

  • గ్రామాభివృద్ధిలో వారి పాత్ర కీలకం

    కృష్ణా: గ్రామాభివృద్ధిలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పాత్ర కీలకమని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అన్నారు. ఆదివారం స్థానిక హైవేపై బండ్రేవుకోడు సమీపంలో స్వచ్ఛ సుందర కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ కార్యకర్తలు హైవేపై, ఇరువైపులా శుభ్రం చేసి, మొక్కలు నాటారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డీఆర్కే దంపతుల సేవలు, కృషి చల్లపల్లికి వరంగా నిలుస్తోందన్నారు.