కృష్ణా: ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామం దూసరపాలెంలో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు పొలాలకు వెళ్లే మార్గం కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈమార్గం గుండా వందల ఎకరాలకు వెళ్లాలంటే, పండించిన పంటను ఎడ్ల బండితో బయటకు తీసుకురావాలంటే రైతులు నానా యాతన పడుతున్నారు. సంబంధిత అధికారులు గ్రావెల్ రోడైనా వేయించి అన్నదాతలకు బాసటగా నిలవాలని రైతులు కోరుతున్నారు.