ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీలో వినాయక చవితి సందర్భంగా మండపాలలో మూడు రోజుల పాటు ఘనంగా పూజలు జరిగాయి. శనివారం వినాయకుడు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాడు. ఇందిరా కాలనీలో ఇబ్రహీంపట్నం క్రైమ్ ఎస్ఐ సేనాపతి శ్రీనివాస్ పూజల్లో పాల్గొన్నారు. మండప నిర్వహకులు వారిని సన్మానించారు. ఇందిరా నగర్‌లో లడ్డు వేలంలో ఆవులూరి రెడ్డి 20,100 రూపాయలకు లడ్డులు గెలుచుకున్నారు.
Locations: Krishna
-
‘ఛోటా న్యూస్ ఎఫెక్ట్’.. స్పందించిన అధికారులు
ఎన్టీఆర్: మైలవరం మండలం వెల్వడంలో పారిశుధ్య లోపంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికుల సమస్యపై ‘ఛోటా న్యూస్’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే చర్యలు చేపట్టి, కార్మికులకు ఆరు నెలల బకాయిలలో మూడు నెలల జీతాన్ని చెల్లించారు. దీంతో కార్మికులు తిరిగి విధుల్లోకి చేరి పారిశుధ్య సమస్యను పరిష్కరించారు.
-
‘యువత ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి’
కృష్ణా: చల్లపల్లిలో చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో ఎస్.ఆర్.వై.ఎస్.పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ప్రిన్సిపాల్ తగిరిశ సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ కే.ఈశ్వరరావు యువతను రక్తదానం చేయాలని కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 35 యూనిట్ల రక్తం సేకరించింది. సీఐ, తహసీల్దార్ డీ.వనజాక్షి, రెడ్ క్రాస్ కార్యదర్శి భవిరి శంకర్‌నాధ్ శిబిరం ప్రారంభించారు.
-
‘చెత్త నుంచి సంపదే కాకుండా విద్యుత్ ఉత్పత్తి’
ఏలూరు: నూజివీడు పట్టణంలో 32వ వార్డుల్లో 70వేల మంది జనాభా రోజుకు 28టన్నుల చెత్త ఉత్పత్తి చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది దానిని రీసైక్లింగ్ చేసి, 10టన్నుల చెత్తను గుంటూరు జిందాల్ విద్యుత్ సంస్థకు తరలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది రాష్ట్ర విద్యుత్ సరఫరాకు ఉపయోగపడుతుంది. మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్ పి. సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
-
గుణదల విశాల్ మార్ట్‌లో అగ్నిప్రమాదం
ఎన్టీఆర్: గుణదలలోని విశాల్ మార్ట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నూనె ప్యాకెట్ల నిల్వలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, నిమిషాల్లో షాపును చుట్టుముట్టాయి. నూనె ప్యాకెట్లపై మంటలు పడటంతో ప్రమాదం తీవ్రమైంది. మంటలు అరుపుతున్న ఫైర్ సిబ్బంది మొత్తం షాపును కాపాడేందుకు కృషి చేస్తున్నారు. మాచవరం పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూటా మరి ఏదన్నానా విషయం తెలియాల్సి ఉంది.
-
గణనాథుని శోభాయత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎన్టీఆర్: నందిగామ మండలం చందాపురం గ్రామంలో శనివారం శోభాయత్రగా గణనాథుని ప్రతిమ నిమజ్జన యాత్రకు బయలుదేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి కొబ్బరికాయలు కొట్టి యాత్ర ప్రారంభించారు. భక్తులు ఘనంగా పాల్గొని, గణేష్ చతుర్థి ఉత్సవాలను ఆవిష్కరించుకున్నారు. ఈ యాత్ర గ్రామవాసులకు ఆనందాన్నిచ్చింది.
-
‘సాంకేతికతలో నైపుణ్యం సాధించాలి’
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నల్ హ్యాకథాన్-2025 నిర్వహించారు. కాలేజీ సెక్రటరీ రామ్‌మోహన్ రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, APSCHE సౌజన్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ అవగాహన కోసం ఈ హ్యాకథాన్ నిర్వహించామన్నారు. విద్యార్థులు సృజనాత్మకతతో క్వాంటమ్ టెక్నాలజీ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. సాంకేతికతలో నైపుణ్యం సాధించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధర్ సూచించారు.
-
టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్: నందిగామ మండలం చందాపురం గ్రామంలో కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. ఈ మేరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురై కుడి కాలు శాస్త్ర చికిత్స అనంతరం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న కొండబోలు వినాయకరావుని వారి స్వగృహంలో కలసి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
-
గణనాథుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌లో శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని మండపం వినాయక చవితి సందర్భంగా భక్తులను ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) ఈ భారీ గణనాథుని మండపాన్ని దర్శించి, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
-
వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
కృష్ణా: పెడన నియోజకవర్గం బంటుమిల్లి, పెడన మండలాలలో పలు వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు వినాయకుని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.