కృష్ణా: ఘంటసాల మండలంలో తాడేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్ శనివారం ప్రారంభించారు. టీడీపీ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్లు శివప్రసాద్, లిల్లీపాల్, శ్వేత, పవన్‌కుమార్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
Locations: Krishna
-
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ అమ్మితే చర్యలే..!
ఎన్టీఆర్: మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఏసీపీ దామోదర్ మెడికల్ షాప్ యజమానులను హెచ్చరించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అమ్మకాలు ఉంటే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. NRX ఔషధాల అమ్మకాలపై కఠిన నియమాలు పాటించాలని ఆదేశించారు.
-
‘పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించాలి’
ఎన్టీఆర్: వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, నియోజకవర్గ సమన్వయకర్తల కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అవినాష్ పిలుపునిచ్చారు.
-
గుడివాడలో మాజీ మంత్రుల భేటీ
కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు శనివారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటికి పేర్ని నాని వెళ్లారు. కోర్టు షరతుల మేరకు ఈరోజు కొడాలి నాని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయనున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని గుడివాడకు వచ్చినట్లు తెలుస్తోంది.
-
గోవులను కబేళాలకు తరలిస్తున్న పట్టించుకోని అధికారులు!
కృష్ణా: హనుమాన్ జంక్షన్ బాపులపాడు పశువుల సంత నుంచి వేల గోవులను కబేళాలకు తరలిస్తున్నారని, అధికారులు, రాజకీయ నాయకులు సిండికేట్‌గా లంచాలతో పోలీస్‌స్టేషన్లను దాటిస్తున్నారని గో పరివార్ జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కోసం జిల్లా ఎస్పీ సహాయంతో చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం గోశాలల ఏర్పాటుతో గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
-
ఘనంగా సింహాచల లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ఎన్టీఆర్: నందిగామలో వాసవి మార్కెట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సింహాచల లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. సింహాచలం నుంచి స్వామివారి ప్రచార రథం నందిగామకు చేరుకుంది. నందిగామ గాంధీ సెంటర్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ శ్రీనివాస కల్యాణం ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదివేల మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
-
కొండపల్లి ఖిల్లా రోడ్ ముఖద్వారం పనుల పరిశీలన
ఎన్టీఆర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. అందులో భాగంగా కొండపల్లి ఖిల్లా రోడ్ ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖద్వారం పనులను మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక శాఖ కొండపల్లి బొమ్మలను టూరిస్టులు కొనుగోలు చేసేందుకు, కృషి చేస్తుందన్నారు. త్వరితగతిన నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు.
-
ఎండపల్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
కృష్ణా: కృత్తివెన్ను మండలం ఎండపల్లి పంచాయతిలో క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వేలు ముద్రలు పడక ఇబ్బంది పడుతున్న వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు వివరించారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు జన్యావుల శ్రీను, సర్పంచ్ ప్రభు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
-
పిల్లల పెంపకంపై అవగాహన కార్యక్రమం
కృష్ణా: ఘంటసాలలోని నందం బజారులో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని సామాజిక విజ్ఞాన కళాశాల రావే విద్యార్థులు శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా పిల్లలను పెంచే విధానం, వాటి ప్రయోజనాలు, ప్రతికూల ప్రభావాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రేమతో కూడిన క్రమశిక్షణను పాటించటం వంటి అంశాలను విద్యార్థినులు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సునీత, తదితరలు పాల్గొన్నారు.
-
‘కొండపల్లిలో పర్యటించండి’
ఎన్టీఆర్: పర్యాటక కేంద్రమైన కొండపల్లిలో పర్యటించాలని మంత్రి కందుల దుర్గేష్‌ను జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, ప్రోగ్రామ్ కమిటీ నాయకులు పురమా సతీష్ కుమార్ కోరారు. ఈనేపథ్యంలో మంత్రిని జనసేన నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొండపల్లి ఖిల్లా, కొయ్య బొమ్మలు, పవిత్ర సంగమం విశిష్టతను మంత్రికి వివరించారు. పర్యాటకులకు నచ్చేలా, మెచ్చేలా ఈప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు.