Locations: Krishna

  • అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల క్వారీల వద్ద అక్రమ నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నారన్న సమాచారంతో అధికారులు అక్కడికి వెళ్లారు. ఎలాంటి పత్రాలు లేకపోవడం నిర్మాణాలు నిలిపి వేయాలని రెవెన్యూ  అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

  • CMRF.. పేదలకు వరం: MLA వసంత

    ఎన్టీఆర్: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని, వారి ఆర్థిక అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండలంలోని 24మందికి రూ.15,69,189లు, విజయవాడ రూరల్ మండలంలోని 11 మందికి రూ.5,40,302ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మరొకరికి రూ.2.25లక్షల ఎల్‌ఓసీ అందించారు.

     

  • చల్లపల్లిలో Pay Back To Society అమలు

    కృష్ణా: చల్లపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విజయవాడ దనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో AI గ్రూప్ చదువుతున్న వక్కలగడ్డ సిరివెంకట్‌కు పుస్తకాలు, కాలిక్యులేటర్‌లు బహుకరించి ఏపీ సెక్రటేరియట్ న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరరావు pay back to society అమలు చేశారు. నాలుగు సంవత్సరాల మెటీరియల్ అందిస్తానని వెంకటేశ్వరరావు భరోసా ఇచ్చారు. 
  • విశాఖకు అవనిగడ్డ జనసేన క్రియా వాలంటీర్లు

    కృష్ణా: విశాఖపట్నంలో శనివారం జరిగే ‘సేనతో సేనాని’ సమావేశానికి అవనిగడ్డ నియోజకవర్గ జనసేన క్రియా వాలంటీర్లు తరలివెళ్లారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో క్రియా వాలంటీర్లు విశాఖపట్నం బయలుదేరారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ధ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పార్టీ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

  • వెల్వడాన్ని వెంటాడుతున్న పారిశుద్ధ్య లోపం

    ఎన్టీఆర్: మైలవరం మండలం వెల్వడం గ్రామంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 6 నెలలుగా మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు 8 రోజులుగా విధులకు రావడం లేదు. దీంతో గ్రామంలోని చెత్తకుప్పలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో చాలామంది సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నారని వాపోయారు.

  • ప్రభుత్వ సేవలందక..ప్రైవేట్ ఆసుపత్రులకే పయనమిక!

    ఎన్టీఆర్: మైలవరం మండల పరిధిలోని వెల్వడం, గణపవరం, చంద్రాల, ఎదురుమిడం గ్రామాల్లో సీజనల్ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో మైలవరంలోని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద వైద్యం చేయించుకునేందుకు బాధితులు క్యూ కడుతున్నారు. పారిశుధ్యం లోపించటంతో జ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారులు స్పందించి సరైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

  • కౌన్సిల్ సమావేశానికి డేట్ ఫిక్స్

    ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి తేదీ ఖరారు చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన జరుగనున్నట్లు మేయర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని పక్షాల కార్పొరేటర్ల నుంచి కార్యదర్శి విభాగం అధికారులు ప్రతిపాదిత అంశాలు, ప్రశ్నావళిలో పొందుపర్చాల్సిన ప్రశ్నలను స్వీకరిస్తున్నట్లు సమాచారం.

  • ‘నన్ను మాట్లాడనివ్వట్లేదు.. వాకౌట్ చేస్తున్నా’

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర మాట్లాడనివ్వడం లేదని వైసీపీ కౌన్సిలర్ మనోహర్ వాకౌట్ చేశారు. వార్డ్ సమస్యలు, ప్రజా సమస్యల మీద తననను మాట్లాడినవ్వకుండా చేస్తున్నారంటూ మనోహార్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులపై వివక్ష చూపుతూ నిధులు కేటాయించట్లేదని విమర్శించారు. ఇప్పటివరకు రూ.లక్ష కూడా అభివృద్ధికి కేటాయించలేదన్నారు.

     

  • పరిటాల ఆదర్శాలు ఉత్తేజపరుస్తాయ్: దేవినేని

    ఎన్టీఆర్: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకొని గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళి కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు పరిటాల  చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన రాజకీయ,సామాజిక సేవలను స్మరించుకున్నారు. పరిటాల రవి ఫ్యాక్షన్ హింసకు వ్యతిరేకంగా పోరాడి, ప్రజల హక్కుల కోసం అలుపెరగని కృషి చేశారన్నారు. ఆయన ఆదర్శాలు పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తాయని దేవినేని అభిప్రాయపడ్డారు.

  • ఏకత్వ పాఠశాలలో రక్తదాన శిబిరం ప్రారంభం

    ఎన్టీఆర్: వీరులపాడు మండలం పొన్నవరం సమీపంలోని ఏకత్వ పాఠశాలలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని నందిగామ చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ అమరనేని రమేష్‌బాబు, పాఠశాల డైరెక్టర్ అమరనేని మనోజ్‌లు ప్రారంభించి రక్తదాన ఆవశ్యకతను వివరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వైద్యాధికారి ఎస్.మదన్‌మోహన్ రక్తదానం ఉపయోగాలు, ఎవరెవరు రక్తదానం చేయవచ్చనే విషయాలను వివరించారు.