ఎన్టీఆర్: విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి తేదీ ఖరారు చేశారు. సెప్టెంబర్ 16వ తేదీన జరుగనున్నట్లు మేయర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని పక్షాల కార్పొరేటర్ల నుంచి కార్యదర్శి విభాగం అధికారులు ప్రతిపాదిత అంశాలు, ప్రశ్నావళిలో పొందుపర్చాల్సిన ప్రశ్నలను స్వీకరిస్తున్నట్లు సమాచారం.
Locations: Krishna
-
‘నన్ను మాట్లాడనివ్వట్లేదు.. వాకౌట్ చేస్తున్నా’
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేడెక్కింది. మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర మాట్లాడనివ్వడం లేదని వైసీపీ కౌన్సిలర్ మనోహర్ వాకౌట్ చేశారు. వార్డ్ సమస్యలు, ప్రజా సమస్యల మీద తననను మాట్లాడినవ్వకుండా చేస్తున్నారంటూ మనోహార్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులపై వివక్ష చూపుతూ నిధులు కేటాయించట్లేదని విమర్శించారు. ఇప్పటివరకు రూ.లక్ష కూడా అభివృద్ధికి కేటాయించలేదన్నారు.
-
పరిటాల ఆదర్శాలు ఉత్తేజపరుస్తాయ్: దేవినేని
ఎన్టీఆర్: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకొని గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళి కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు పరిటాల చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన రాజకీయ,సామాజిక సేవలను స్మరించుకున్నారు. పరిటాల రవి ఫ్యాక్షన్ హింసకు వ్యతిరేకంగా పోరాడి, ప్రజల హక్కుల కోసం అలుపెరగని కృషి చేశారన్నారు. ఆయన ఆదర్శాలు పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తాయని దేవినేని అభిప్రాయపడ్డారు.
-
ఏకత్వ పాఠశాలలో రక్తదాన శిబిరం ప్రారంభం
ఎన్టీఆర్: వీరులపాడు మండలం పొన్నవరం సమీపంలోని ఏకత్వ పాఠశాలలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని నందిగామ చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ అమరనేని రమేష్‌బాబు, పాఠశాల డైరెక్టర్ అమరనేని మనోజ్‌లు ప్రారంభించి రక్తదాన ఆవశ్యకతను వివరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ వైద్యాధికారి ఎస్.మదన్‌మోహన్ రక్తదానం ఉపయోగాలు, ఎవరెవరు రక్తదానం చేయవచ్చనే విషయాలను వివరించారు.
-
చెరువులో వృద్ధుడి మృతదేహం లభ్యం
ఎన్టీఆర్: తిరువూరులోని మధిర రోడ్డు పక్కన ఉన్న చెరువులో శనివారం ఓవృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పొలానికి వెళ్లి వస్తుండగా మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఎస్సై సత్యనారాయణ ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు చింతలకాలనీకి చెందిన సుందరరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
-
రోడ్డంతా రద్దీ.. ప్రయాణానికి ఇబ్బంది
ఎన్టీఆర్: కంచికచర్లలో జాతీయ రహదారి ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల దూరం మేరకు పూర్తిగా ఆక్రమణలలో చిక్కుకుంది. నిత్యం వందలాది వాహనాలు ఆ దారి వెంట రాకపోకలు సాగిస్తుంటాయి. చెవిటికల్లు సెంటర్ నుంచి కంచలమ్మ ఆలయం వరకు, నెహ్రూసెంటర్ నుంచి పెట్రోల్‌బంక్ వరకు ఆక్రమణలు పెరిగడంతో ప్రయాణం ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఆక్రమణలు తొలగించి సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
-
సీఐపై ఆర్ఎస్ఎస్, జేఏసీ నేతల ఫిర్యాదు
కృష్ణా: హనుమాన్ జంక్షన్ పరిధిలో ఆవుల తరలింపుపై ఆర్ఎస్‌ఎస్, జేఏసీ నాయకులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు స్థానిక సీఐ కేవీవీఎన్ సత్యనారాయణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆవుల మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ సీఐ బాధ్యతను గన్నవరం సీఐ శివప్రసాద్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
-
జిల్లాలో కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలు
ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలను రూపొందించారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం అన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించడానికే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో 295 సెంటర్లలో 1,200మంది ఓటర్లు మించి ఉన్నారన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 129తో కలిపి జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,921కి చేరిందన్నారు.
-
నిరుద్యోగులకు గుడ్ న్యూస్
కృష్ణా: గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. హెటిరో ల్యాబ్స్, మెకనార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు మేళాలో పాల్గొననున్నాయని వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిప్లోమా, డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
డీజే వ్యాపారులకు ఎస్సై నోటీసులు జారీ
ఎన్టీఆర్: గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో డీజే వ్యాపారులకు జగ్గయ్యపేట ఎస్సై రాజు నోటీసులు జారీ చేశారు. ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జనాల సమయంలో డీజేలో అసభ్యకరమైన పాటలు, రాజకీయ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలను పెట్టవద్దని తెలిపారు. అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని, అరెస్టు చేస్తామని హెచ్చరించారు.