Locations: Krishna

  • ఛైర్మన్ స్ట్రిక్ట్ వార్నింగ్

    ఎన్టీఆర్: కొండపల్లి పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని మున్సిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హెచ్చరించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. సమావేశంలో తన దృష్టికి వచ్చిన భూ కబ్జాలపై ఛైర్మన్ మాట్లాడుతూ..కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కబ్జా స్థలాలకు పన్నులు విధించే అధికారులు చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.

  • నందిగామ డివిజన్‌లో 93.6మి.మీ వర్షపాతం

    ఎన్టీఆర్: నందిగామ డివిజన్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 93.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వత్సవాయిలో 24.2మి.మీ., జగ్గయ్యపేటలో 33.4మి.మీ., పెనుగంచిప్రోలులో 10.4మి.మీ., నందిగామలో 12.2మి.మీ., వీరులపాడులో 5.6మి.మీ., కంచికచర్లలో 3.4మి.మీ., చందర్లపాడులో 4.4 మి.మీ. నమోదయ్యాయి. డివిజన్లో సగటుగా 13.3మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  • గణపతి నవరాత్రులు.. ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

    కృష్ణా: గుడివాడ మెయిన్ రోడ్డులో ప్రాముఖ్యత కలిగిన శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శనివారం శ్రీ వీర గణపతి అలంకారంలో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా శివజ్యోతి నృత్యాలయం కళాకారులు నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులకు దేవస్థానం ఛైర్మన్ రాజేష్, ఈవో వాసు దేవదాయశాఖ సర్టిఫికెట్లను అందించారు.

     

  • గర్భం దాల్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

    శ్రీకాకుళం: బాలికను మోసగించిన యువకుడిపై శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌‌లో కేసు నమోదైంది. విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె శ్రీకాకుళం నగరంలోని బాకెర్‌సాహెబ్‌పేటలో తన అమ్మమ్మ ఇంటికి తరచూ వస్తుండేది. సెల్‌ఫోన్ షాపు నిర్వాహకుడు శ్యామసుందరరావు బాలికను గర్భవతిని చేశాడు. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ఈశ్వరరావు వెల్లడించారు.

  • గోపాల్‌కు ప్రజాసేవ రత్న అవార్డు

    ఎన్టీఆర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన మైలవరానికి చెందిన పల్లబోతుల గోపాల్‌కు ప్రజాసేవ రత్న అవార్డు లభించింది. ఉపాధ్యాయులుగా విశేష సేవలందించి, విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యనందించి, విద్యార్థులను ఉపాధి వైపు నడిపిస్తూ, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా..ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి గుంటూరుకు చెందిన ఆచార్య చారిటబుల్ ట్రస్ట్ వారు సత్కరించి ఈఅవార్డును అందజేశారు.

  • రాజీమార్గంలో కేసుల పరిష్కారానికై..!

    కృష్ణా: బంటుమిల్లిలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార కమిటీ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ఎం.భాస్కరరావు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను కక్షిదారులతో మాట్లాడి రాజీ చేయించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజీమార్గంలో కేసులను పరిష్కరించేందుకే ఈ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు.

     

  • మాస్టర్‌ పుట్టినరోజు నేడు.. ప్రేమతో ఇలా!

    కృష్ణా: చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో నేడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. శ్రీమంతురాజా యార్లగడ్డ శివ రామప్రసాద్ బహదూర్ కళాశాల పూర్వ అధ్యాపకులు తగిరిశ సాంబశివరావు మాస్టkh పుట్టినరోజును పురస్కరించుకుని శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు.

     

  • ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు చెక్

    ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్లో ఎరువుల విక్రయాలను సహించబోమని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాలాప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు ఇకపై రైతన్నలు ఎరువుల కోసం రైతు సేవాకేంద్రాలు, సహకార సొసైటీల ద్వారా ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువుల బస్తాలను పొందగలరని పేర్కొన్నారు.

     

  • ధర్మాజీగూడెంలో రేషన్ స్టాక్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

    ఏలూరు: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని ఎంవైఎల్ పాయింట్ వద్ద గోడౌన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు స్టాక్‌ను సబ్ కలెక్టర్ వినూత్న తనిఖీ చేశారు. రేషన్ డీలర్లు బియ్యం తీసుకెళ్లే ముందు, షాపులో దించిన వెంటనే వేలిముద్రలు వేయాలని ఆదేశించారు. 34 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసి, వేలంపాటకు సిద్ధం చేయాలని సూచించారు. హమాలీలు, రేషన్ డీలర్ల సమస్యలను తెలుసుకున్నారు.

  • వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా వేల్పుల రమేష్

    ఎన్టీఆర్: వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా వేల్పుల రమేష్ నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకానికి కృషి చేసిన వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణకుమార్, నందిగామ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.