
Locations: Krishna
-
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు
తూర్పుగోదావరి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కొంచం ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. తిరిగి ఈనెల 11న కోర్టులో సరెండర్ కావాలని షరతు విధించింది. -
వినాయక మండపాల్లో మంత్రి పార్థసారధి పూజలు
ఏలూరు: నూజివీడు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు మండపాలను రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సందర్శించారు. గాంధీనగర్, 31వ వార్డు, చిన్న గాంధీ బొమ్మ సెంటర్, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లలోని వినాయక మండపాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ కమిటీలు స్వాగతం పలికాయి.
-
మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాగులు మీరా
ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, కేతనకొండ గ్రామానికి చెందిన పఠాన్ నాగులు మీరా నియమితులయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, వైఎస్సార్సీపీ స్థాపన నుంచి పార్టీలో చురుగ్గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నందుకు గుర్తింపుగా ఈ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు.
-
అన్నప్రసాద వితరణలో పాల్గొన్న MLA సౌమ్య
ఎన్టీఆర్: నందిగామ మెయిన్ సెంటర్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ 35వ వార్షికోత్సవం సందర్భంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు అన్నదానం చేశారు. గణేశ్ ఉత్సవ కమిటీ 35 సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తోందని ఆమె ఈ సందర్భంగా ప్రశంసించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
నందిగామలో వేగ జువెలరీ మెగా ఎగ్జిబిషన్ ప్రారంభం
ఎన్టీఆర్: నందిగామలోని రైతుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపంలో వేగ జువెలరీ మెగా ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగలు సంప్రదాయం, సౌందర్యానికి ప్రతీకలని అన్నారు. ఈ ప్రదర్శనలో సాంప్రదాయ, ఆధునిక డిజైన్లతో కూడిన బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు కొనుగోలుకు అందుబాటులో ఉంచారు.
-
విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చిన NRI చవళం వాసు
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పేరకలపాడుకు చెందిన ప్రవాస ఆంధ్రుడు చవళం శ్రీనివాసరావు (వాసు) ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా గ్రామంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మొదటి స్థానం సాధించిన మాడుగుల వరుణ్ సందేశ్‌కు రూ. 5000 నగదు బహుమతి ఇచ్చారు. ఆయన ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు కాలేజీ ఫీజులు కూడా చెల్లించి ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్నే సాత్విక పాల్గొన్నారు.
-
‘తాగుబోతు భర్తలతో ఇబ్బందిపడే మహిళలకు చేయూతనివ్వాలి’
ఎన్టీఆర్: కొండపల్లిలోని ఐద్వా కార్యాలయంలో జరిగిన పట్టణ మహాసభలో, ఐద్వా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. శ్రీదేవి మాట్లాడుతూ, మహిళలకు ఉపాధి, గృహ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం వ్యసనంతో బాధపడుతున్న భర్తలతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు ఆర్థిక చేయూతనివ్వాలని ఆమె కోరారు. అలాగే, మహిళల భద్రత, సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉద్ఘాటించారు. ఈ సమావేశానికి ఐద్వా పట్టణ అధ్యక్షురాలు ఎల్.పార్వతి అధ్యక్షత వహించారు.
-
చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫైర్
కృష్ణా: వ్యవసాయానికి బదులు పాడి గేదెలు కొనుగోలు చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మచిలీపట్నంలో అన్నదాత పోరు గోడపత్రికలను పేర్ని కిట్టి, రాముతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 9న రైతుల సమస్యలపై ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వివరిస్తామని చెప్పారు.
-
కంచికచర్లలో భారీ అన్నదానం
ఎన్టీఆర్: కంచికచర్లలో వాణిజ్య గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కంచికచర్ల యార్డ్ ఛైర్మన్ కోగంటి బాబు, నందిగామ గ్రామీణ సీఐ డి. చవాన్, ఎస్సై విశ్వనాధ్ లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వారు గణపతికి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని, గణనాథుని దర్శించుకున్నారు.
-
బంటుమిల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
కృష్ణా: బంటుమిల్లి మండలం మణిమేశ్వరంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.43.60 లక్షల విలువ గల గ్రామ పంచాయతీ భవనం, రూ.23.94 లక్షల రైతు సేవా కేంద్రం, 60 KL సంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమరావతి, పోలవరం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.