ఎన్టీఆర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన మైలవరానికి చెందిన పల్లబోతుల గోపాల్‌కు ప్రజాసేవ రత్న అవార్డు లభించింది. ఉపాధ్యాయులుగా విశేష సేవలందించి, విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యనందించి, విద్యార్థులను ఉపాధి వైపు నడిపిస్తూ, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా..ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి గుంటూరుకు చెందిన ఆచార్య చారిటబుల్ ట్రస్ట్ వారు సత్కరించి ఈఅవార్డును అందజేశారు.
Locations: Krishna
-
రాజీమార్గంలో కేసుల పరిష్కారానికై..!
కృష్ణా: బంటుమిల్లిలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార కమిటీ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ఎం.భాస్కరరావు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులను కక్షిదారులతో మాట్లాడి రాజీ చేయించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజీమార్గంలో కేసులను పరిష్కరించేందుకే ఈ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు.
-
మాస్టర్ పుట్టినరోజు నేడు.. ప్రేమతో ఇలా!
కృష్ణా: చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో నేడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. శ్రీమంతురాజా యార్లగడ్డ శివ రామప్రసాద్ బహదూర్ కళాశాల పూర్వ అధ్యాపకులు తగిరిశ సాంబశివరావు మాస్టkh పుట్టినరోజును పురస్కరించుకుని శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు.
-
ఎరువుల బ్లాక్ మార్కెట్‌కు చెక్
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్లో ఎరువుల విక్రయాలను సహించబోమని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మినేని జ్వాలాప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు ఇకపై రైతన్నలు ఎరువుల కోసం రైతు సేవాకేంద్రాలు, సహకార సొసైటీల ద్వారా ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే ఎరువుల బస్తాలను పొందగలరని పేర్కొన్నారు.
-
ధర్మాజీగూడెంలో రేషన్ స్టాక్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
ఏలూరు: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని ఎంవైఎల్ పాయింట్ వద్ద గోడౌన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు స్టాక్‌ను సబ్ కలెక్టర్ వినూత్న తనిఖీ చేశారు. రేషన్ డీలర్లు బియ్యం తీసుకెళ్లే ముందు, షాపులో దించిన వెంటనే వేలిముద్రలు వేయాలని ఆదేశించారు. 34 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసి, వేలంపాటకు సిద్ధం చేయాలని సూచించారు. హమాలీలు, రేషన్ డీలర్ల సమస్యలను తెలుసుకున్నారు.
-
వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా వేల్పుల రమేష్
ఎన్టీఆర్: వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా వేల్పుల రమేష్ నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకానికి కృషి చేసిన వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణకుమార్, నందిగామ నియోజకవర్గం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
-
స్వామివారి సేవలో నూతన తహశీల్దార్
కృష్ణా: మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని తహశీల్ధార్ ఎం.హరినాథ్ దర్శించుకున్నారు. ఆయన మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి మోపిదేవి మండల తహశీల్దారుగా నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు తహశీల్దారుని ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
-
గిడుగు రామమూర్తి చిత్రపటానికి ఘన నివాళి
కృష్ణా: తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో గాంధీ క్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి చిత్రపటానికి , ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, దివిసీమ లలిత కళాసమితి ప్రధాన కార్యదర్శి కే.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
-
టీడీపీ నేత ముక్కపాటికి ఎమ్మెల్యే పరామర్శ
ఎన్టీఆర్: నందిగామ పట్టణం 8వ వార్డు సాయి సదన్ అపార్ట్‌మెంట్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ సీనియర్ నేత ముక్కపాటి నరసింహారావును వారి స్వగృహంలో కలిసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
-
మార్కెట్ యార్డ్ పీఠం ఎవరికి దక్కేను..!
ఎన్టీఆర్: జగ్గయ్యపేట నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ పీఠం ఎవరికీ వస్తుందని ఆసక్తి నెలకొది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలతో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శుక్రవారం మార్కెట్ యార్డులో సుమారు 2గంటల పాటు చర్చించారు. తమకు రావాల్సిన పదవులు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జగ్గయ్యపేటలో టీడీపీకి చెందిన ఎస్సీ నాయకులు పదవుల కోసం బుజ్జికిస్తున్నారు.