Locations: Krishna

  • ‘పోలీస్ పనితీరు మెరుగుపడేందుకు టెక్నాలజీ కీలకం’

    ఎన్టీఆర్: పటమట పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకుడు గద్దె రమేష్ కుమార్ కొనుగోలు చేసిన 32 ఇంచెస్ LED మానిటర్‌ను యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ శుక్రవారం సీఐ పవన్ కిషోర్‌కు ఉచితంగా అందజేశారు. క్రాంతి కుమార్ మాట్లాడుతూ, పోలీస్ పనితీరు మెరుగుపడేందుకు సాంకేతిక వనరులు కీలకమని, ఆధునిక పరికరాలతో సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందుతాయని, డిజిటల్ పరికరాలు పౌర సమస్యలను త్వరగా పరిష్కరిస్తాయని పేర్కొన్నారు.

  • అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంపై కలెక్టర్ ఆరా

    కృష్ణా: కనుమూరులో సంధ్య ఆక్వా, శ్యామ్ ఆక్వాలను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంపై ఆక్వా పరిశ్రమ యాజమాన్యాలతో కలెక్టర్ సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుంకాల వల్ల నష్టాలు వస్తున్నాయా అని ఆరా తీశారు. అంతకు ముందు ఎలా ఉండేది… ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.

  • పూడికతీత పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

    ఎన్టీఆర్: నందిగామలో రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశానుసారం నందిగామ పట్టణంలో పూడికతీత పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పట్టణంలోని 6వ వార్డులో కూటమి నేతలు, సచివాలయ సిబ్బందితో కలసి మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పర్యవేక్షించారు.

  • ‘స్మార్ట్ రేషన్ కార్డులతో మరింత మెరుగైన సేవలు’

    ఎన్టీఆర్: రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో తొలివిడతగా ప్రారంభించిన కొత్త సాంకేతిక కలిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాండ్రపాడు గ్రామ సచివాలయంలో లబ్ధిదారులకు రేషన్ డీలర్ సీతమ్మతో కలసి భారతీయ జనతా యువమోర్చా నాయకుడు శివకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ నూతన కార్డులు ప్రజలకు గతంలో కంటే మరింత మెరుగైన సేవలు అందిస్తాయని తెలిపారు.

  • పేదల ఆరోగ్య భద్రతే ధ్యేయం: MLA సౌమ్య

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహించింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గ్రామస్థితిని పర్యవేక్షించి, అధికారులతో చర్చించారు. నీటినిల్వల వల్ల జ్వరాలు, అంటువ్యాధులు వ్యాపించకుండా శుభ్రతా చర్యలు, వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి సత్యనారాయణ బాబు, కూటమినేతలు, స్థానికులు పాల్గొన్నారు.

  • వినాయక మండపాన్ని సందర్శించిన MLA సౌమ్య

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కునికిన పాడు గ్రామంలో వినాయక మండపాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గణేష్‌కు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నేతలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’

    కృష్ణా: క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ముందుగా జాతీయ జెండా, క్రీడా పతాకం ఎగురవేసి వారు ప్రారంభించారు.

  • పేషెంట్లు భోజనం కోసం ఇబ్బంది పడకూడదు: MLA

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ సర్టిఫికెట్ల కొరకు వచ్చిన దివ్యాంగులు, అలాగే చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు భోజనానికి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రత్యేకంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం స్వయంగా అన్నప్రసాదాన్ని వితరణ చేసి, హాజరైన వారితో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు.

  • ‘గణేష్ ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి’

    ఎన్టీఆర్: గణేష్ ఆశీస్సులతో అందరూ సుభక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల మండలం ఎస్.అమరవరం గ్రామంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యాడ్ ఛైర్మన్ కొగంటి బాబు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన: తంగిరాల

    ఎన్టీఆర్: నందిగామ కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను తెలియజేయగా, ఆమె వెంటనే స్పందించి, సమస్యలను నమోదు చేయించి అధికారులకు సూచనలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన చేరుస్తుందని, సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.