Locations: Krishna

  • వినాయక మండపాన్ని సందర్శించిన MLA సౌమ్య

    ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కునికిన పాడు గ్రామంలో వినాయక మండపాన్ని శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గణేష్‌కు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నేతలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’

    కృష్ణా: క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను ముందుగా జాతీయ జెండా, క్రీడా పతాకం ఎగురవేసి వారు ప్రారంభించారు.

  • పేషెంట్లు భోజనం కోసం ఇబ్బంది పడకూడదు: MLA

    ఎన్టీఆర్: జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ సర్టిఫికెట్ల కొరకు వచ్చిన దివ్యాంగులు, అలాగే చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు భోజనానికి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రత్యేకంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం స్వయంగా అన్నప్రసాదాన్ని వితరణ చేసి, హాజరైన వారితో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు.

  • ‘గణేష్ ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి’

    ఎన్టీఆర్: గణేష్ ఆశీస్సులతో అందరూ సుభక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల మండలం ఎస్.అమరవరం గ్రామంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యాడ్ ఛైర్మన్ కొగంటి బాబు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన: తంగిరాల

    ఎన్టీఆర్: నందిగామ కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను తెలియజేయగా, ఆమె వెంటనే స్పందించి, సమస్యలను నమోదు చేయించి అధికారులకు సూచనలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన చేరుస్తుందని, సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

  • సూపర్ సిక్స్ అమలుతో ప్రజల్లో ఆనందోత్సాహాలు: మంత్రి

    కృష్ణా: సూపర్ సిక్స్ హామీల అమలుతో రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతం కావటంతో మచిలీపట్నం నియోజకవర్గ మహిళలతో స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహిళల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • జోరుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మోపిదేవి మండలంలో చురుకుగా సాగుతోంది. మోపిదేవి మండల పరిధిలోని మెరకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం స్మార్ట్ కార్డులను పీఎసీఎస్ ఛైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారి మోపిదేవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతోంది.

  • మోపిదేవి ఎస్ఐకు ఘన సత్కారం

    కృష్ణా: మోపిదేవి మండలం పెద్దప్రోలు గ్రామంలోని అంకదేవర దేవస్థానం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి, మూడు రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణ పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనను రజక సంఘం వారు ఆయనను సత్కరించారు. 1500 మందికి అన్న సమారాధన జరిగింది.

  • P-4 ద్వారా పేదలకు ఉప సర్పంచ్ సాయం

    కృష్ణా: పేదరిక నిర్మూలనలో భాగంగా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P-4 కార్యక్రమంలో చల్లపల్లి ఉప సర్పంచ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముమ్మనేని నాని పేదలకు సాయం అందించారు. నారాయణరావు నగర్ ఎస్టీ ఏరియాలో కళ్ళేపల్లి కోటేశ్వరికి రూ.5,000, సరుకులు, కూతాడ పద్మకు కుట్టుమిషన్ అందించారు. మెప్మా పీడీ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, ఎంపీడీఓ ఏ.వి.రమణ ద్వారా సాయం అందించినందుకు నానిని అభినందించారు.

  • ఆ పథకం అమలు చేయకుంటే.. ఆందోళనే..!

    ఎన్టీఆర్: ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం అందించాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్. శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ మేనిఫెస్టో హామీలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, జీవో నెం.21 రద్దు, ఫిటెనెస్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ద్వారా జారీ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.