ఎన్టీఆర్: అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ZPHS స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడాజ్యోతి ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొన్నారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, బృంద స్ఫూర్తిని పెంపొందిస్తాయని, యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, దేశ కీర్తిని పెంచాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతిభను వెలికితీస్తాయని అన్నారు.
Locations: Krishna
-
వైసీపీ జిల్లా కార్యదర్శిగా రామ్ ప్రసాద్
ఎన్టీఆర్: విజయవాడ పశ్చిమ వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన నాగోతి గురు రామ్ ప్రసాద్.. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును స్థానిక బ్రాహ్మణ వీధిలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి రామ్‌ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
-
‘ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి హరికృష్ణ’
ఎన్టీఆర్: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనను ఘనంగా స్మరించుకున్నారు. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. నందమూరి హరికృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత అని కొనియడారు.
-
అందరూ సుభిక్షంగా ఉండాలి: మైలవరం ఎమ్మెల్యే
ఎన్టీఆర్: గణేష్ ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి పండుగ మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథులను ఎమ్మెల్యే శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
-
ప్రజా సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
ఎన్టీఆర్: నందిగామలోని కాకాని నగర్‌లో గల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఆమె ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
-
అస్తవ్యస్తంగా పారిశుధ్యం!
ఎన్టీఆర్: కంచికచర్ల మండల కేంద్రంలో రోడ్లపై చెత్త, మురుగు కాలువలు దుర్వాసన వెదజల్లుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంచికచర్ల నుంచి గొట్టుముక్కల రోడ్డు పక్కన టన్నుల చెత్త పేరుకుపోయిందని వాపోతున్నారు. డీవీఆర్ మోడల్, ఇందిరా, అంబేద్కర్, అరుంధతి కాలనీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.
-
జగన్‌పై ఎమ్మెల్యే వసంత విమర్శలు
ఎన్టీఆర్: మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మెగా డీఎస్సీ హామీని నీరుగార్చారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గొల్లపూడి టీడీపీ కార్యాలయంలోఆయన మాట్లాడుతూ.. జగన్ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తోందని, నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ లేని చికిత్సలకు సీఎం ఆర్‌ఎఫ్ ద్వారా 8.29 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు.
-
మేకావారిపాలెం సొసైటీ సభ్యుడు మృతి
కృష్ణా: చల్లపల్లి మండలం మేకావారిపాలెం సొసైటీ సభ్యులు, రైతు తోట కృష్ణమూర్తి మృతి చెందగా, కేడీసీసీ బ్యాంక్ సభ్యుల సంక్షేమ నిధి ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు సొసైటీ ఛైర్ పర్సన్ గుత్తికొండ వంశీకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తోట శ్రీనివాసరావు, టీడీపీ నేత యార్లగడ్డ శ్రీనివాసరావు, సీఈఓ కోరుకొండ శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.
-
ఆర్జీయూకేటీలో ఇంటర్నల్ హాకథాన్
ఏలూరు: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ) నూజివీడులో అమరావతి క్వాంటం వ్యాలీ హాకథాన్(AQVH) 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నల్ హాకథాన్‌ను మినీ SAC ఆడిటోరియంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి 30 టీమ్‌లు నమోదు చేసుకోగా, 29 టీమ్‌లు తమ ఐడియాలను అధికారిక పోర్టల్‌లో సమర్పించాయి. అందులో 25 టీమ్‌లు హాకథాన్‌లో పాల్గొని తమ ప్రతిభను, సృజనాత్మకతను ప్రదర్శించాయి.
-
నందిగామ డివిజన్‌లో వర్షపాతం వివరాలు
ఎన్టీఆర్: నందిగామ డివిజన్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వత్సవాయిలో 16.2 మి.మీ, జగ్గయ్యపేటలో 21.2, పెనుగంచిప్రోలులో 6.2, నందిగామలో 6.8, వీరులపాడులో 35.8, కంచికచర్లలో 18, చందర్లపాడులో 6.8మి. మీ వర్షం పడగా.. డివిజన్‌లో సగటున 15.8మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.