ఎన్టీఆర్: మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మెగా డీఎస్సీ హామీని నీరుగార్చారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గొల్లపూడి టీడీపీ కార్యాలయంలోఆయన మాట్లాడుతూ.. జగన్ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తోందని, నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ లేని చికిత్సలకు సీఎం ఆర్‌ఎఫ్ ద్వారా 8.29 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు.
Locations: Krishna
-
మేకావారిపాలెం సొసైటీ సభ్యుడు మృతి
కృష్ణా: చల్లపల్లి మండలం మేకావారిపాలెం సొసైటీ సభ్యులు, రైతు తోట కృష్ణమూర్తి మృతి చెందగా, కేడీసీసీ బ్యాంక్ సభ్యుల సంక్షేమ నిధి ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు సొసైటీ ఛైర్ పర్సన్ గుత్తికొండ వంశీకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తోట శ్రీనివాసరావు, టీడీపీ నేత యార్లగడ్డ శ్రీనివాసరావు, సీఈఓ కోరుకొండ శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.
-
ఆర్జీయూకేటీలో ఇంటర్నల్ హాకథాన్
ఏలూరు: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ) నూజివీడులో అమరావతి క్వాంటం వ్యాలీ హాకథాన్(AQVH) 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నల్ హాకథాన్‌ను మినీ SAC ఆడిటోరియంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి 30 టీమ్‌లు నమోదు చేసుకోగా, 29 టీమ్‌లు తమ ఐడియాలను అధికారిక పోర్టల్‌లో సమర్పించాయి. అందులో 25 టీమ్‌లు హాకథాన్‌లో పాల్గొని తమ ప్రతిభను, సృజనాత్మకతను ప్రదర్శించాయి.
-
నందిగామ డివిజన్‌లో వర్షపాతం వివరాలు
ఎన్టీఆర్: నందిగామ డివిజన్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 వరకు 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వత్సవాయిలో 16.2 మి.మీ, జగ్గయ్యపేటలో 21.2, పెనుగంచిప్రోలులో 6.2, నందిగామలో 6.8, వీరులపాడులో 35.8, కంచికచర్లలో 18, చందర్లపాడులో 6.8మి. మీ వర్షం పడగా.. డివిజన్‌లో సగటున 15.8మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
-
కొండపల్లి కోటపై మందుబాబుల హల్‌చల్
ఎన్టీఆర్: కొండపల్లి కోట పరిసరాల్లో మందుబాబులు హల్‌చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినాయక చవితిని పురస్కరించుకుని కొందరు యువకులు కార్లు, బైక్‌లపై కోటకు చేరుకున్నారు. వారి వెంట తెచ్చుకొన్న మద్యం తాగుతూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంలో వారి మధ్య వివాదం చెలరేగడంతో రెండు గ్రూపుగా మారి ఒకరిపై మరొకరు దాడికి దిగారు. దీనిపై సీఐ చంద్రశేఖర్ విచారణ చేపట్టారు.
-
3వ రోజు గణపతి నవరాత్రి మహోత్సవాలు
కృష్ణా: గుడివాడ పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం శ్రీ మహాగణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల నాలుగో రోజు శనివారం శ్రీ వీర గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలియజేశారు.
-
రేపు గుడివాడలో ఉద్యోగ మేళా
కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే జాబ్ మేళాను పది, ఇంటర్, ఐటీఐ, డీగ్రీ, బీటెక్, బి. పార్మసీ, పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9666654641, 9848819882 నంబర్లను సంప్రదింవచ్చని స్పష్టం చేశారు.
-
3 నుంచి వీపీఎల్ జట్ల ఎంపిక పోటీలు
ఎన్టీఆర్: ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ ద్వారా నిర్వహించే వీపీఎల్(విజయవాడ ప్రీమియర్ లీగ్) జట్ల ఎంపిక కోసం అర్హత పోటీలు వచ్చే నెల 3వ తేదీ ప్రారంభమవుతాయని ఎంపీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. క్రికెటర్లు వారి జట్ల వివరాలను వచ్చే నెల 1లోపు ఐజీఎంసీ స్టేడియంలోని జిల్లా క్రికెట్ సంఘ కార్యాలయంలో నమోదు చేసు కోవాలి. 17 నుంచి 30 ఏళ్లలోపువారు, విజయవాడ పార్లమెంటు, విజయవాడ గ్రామీణ, పెనమలూరు మండలాల వారు అర్హులన్నారు.
-
గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను సీఐ వైవీఎల్ నాయుడు, మున్సిపల్ ఏఈ ఫణి శ్రీనివాసులు పరిశీలించారు. నిమజ్జన ప్రదేశంలో బారికేడ్లు, లైటింగ్, డ్రైనేజ్, రవాణా సౌకర్యాలను సమీక్షించారు. ప్రజలు శాంతి భద్రతల మధ్య ఉత్సవాలు జరుపుకోవాలని, అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం దాములూరు వరద నీటి ప్రభావాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-
రైతులకు యూరియా సరఫరాకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్
కృష్ణా జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియోకాన్ఫరెన్స్‌లో యూరియా లభ్యత, చెరువుల నీటినిల్వ, పింఛన్లపంపిణీ, మహిళల రక్షణ తదితర అంశాలపై చర్చించారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా గరిష్ట ధరకు యూరియా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.