Locations: Krishna

  • విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి

    కృష్ణా: బందరు మండలం రుద్రవరం గ్రామంలో నిర్మించిన టిడ్కో గృహాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

  • పెడనలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

    కృష్ణా: పెడన పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతంగా జరుగుతున్నాయి. గణపతి నామస్మరణలతో భక్తులు భక్తిశ్రద్ధలతో నవరాత్రులను జరుపుకుంటున్నారు. 16వ వార్డులోని రౌతులవారి వీధిలో శ్రీలక్ష్మీ గణపతి మండపం విద్యుత్ దీపాలు, అందమైన అలంకరణలతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. రౌతుల కుటుంబం రుచికరమైన తీర్థప్రసాదాలతో భక్తులకు ఆతిథ్యమిస్తూ ప్రశంసలు పొందుతోంది. ఈ ఉత్సవాలు పట్టణ ప్రజలకు మరపురాని అనుభూతిని అందిస్తున్నాయి.

  • ‘క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు’

    కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ అన్నారు. వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఇంటర్ హ్యాకాథన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్వాంటం వ్యాలీ కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అమరావతికి అత్యంత సమీపంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉండటం ఒక శుభపరిణామం అన్నారు.

  • ‘చేనేత హస్తకళ ప్రదర్శన.. సద్వినియోగం చేసుకోండి’

    బాపట్ల: విజయవాడ బందర్ రోడ్డులోని రాఘవయ్య పార్క్ ఎదురుగా బాపు మ్యూజియంలో చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అందే శ్రీను తెలిపారు. చెరుకుపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రావణమాసం, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 14 వరకు ప్రదర్శన జరుగుతుందని, 10% తగ్గింపు, పాత పట్టు జరీ చీరల విక్రయ అవకాశం ఉందని, స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  • భారీ వర్షాల వల్ల మంచినీటి కష్టాలు..!

    ఎన్టీఆర్: నందిగామ పురపాలక సంఘం పరిధిలో భారీ వర్షాలు, మున్నేరు స్కీమ్ వద్ద వరదల కారణంగా మోటార్లు ఆన్ చేయలేక మంచినీటి సమస్య ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మోటార్లను రిపేర్ చేసి నీటి సరఫరా చేస్తామని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు నీటిని కాచి తాగాలని సూచించారు.

  • ‘గణేష్ మండపాల వద్ద ఇవి తప్పనిసరిగా పాటించాలి’

    ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ సూచనలతో టౌన్ ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్, ఎస్ఐ నాగేశ్వరరావు వినాయక చవితి విగ్రహ గణేష్ మండపాలను సందర్శించారు. విగ్రహ స్థలాలు శుభ్రంగా, సురక్షితంగా ఉండాలని, విద్యుత్ కనెక్షన్లు,శబ్ద కాలుష్య నియంత్రణ, సీసీటీవీ ఏర్పాటు, క్యూలైన్ నిర్వహణ, అనుమానాస్పద అంశాలపై పోలీసులకు సమాచారం అందించాలని, శాంతియుతంగా ఉత్సవాలు జరపాలని కమిటీ సభ్యులకు సూచించారు.

  • మచిలీపట్నంలో సర్టిఫికేట్స్ పరిశీలన

    కృష్ణా: మెగా డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్లను విద్యాశాఖాధికారులు పరిశీలిస్తున్నారు. మచిలీపట్నం నోబుల్ కాలేజీలో జరుగుతున్న సర్టిఫికేట్స్ పరిశీలనను డీఈఓ రామారావు పరిశీలించారు. ఇప్పటి వరకు 1048 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించినట్లు డీఈఓ తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఐదుగురితో కూడిన బృందం సర్టిఫికేట్లను పరిశీలిస్తోందన్నారు.

  • GST వసూళ్లు సమన్వయంతో చేపట్టాలి: కలెక్టర్

    కృష్ణా: జిల్లాలో వస్తు సేవల పన్ను(GST) వసూళ్లు సమన్వయంతో పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో GST అమలు తీరుతెన్నులపై సంబంధిత శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ..పలు సంస్థల్లో వస్తు సేవల పన్నుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాల వివరాలను సంబంధిత ఆడిటర్ అధికారి వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందజేయాలన్నారు.

  • స్మార్ట్​ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు..!

    కృష్ణా: వినియోగదారులపై ప్రభుత్వం సర్దుబాటు చార్జీలు, అదనపులోడు పేరుతో అదనపు భారాల వసూలు నిలిపివేయాలని CPM జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు డిమాండ్ చేశారు. మచిలీపట్నం రేవతి సెంటర్‌లో బషీరాబాగ్ విద్యుత్ ఉద్యమ అమరుల జ్ఞాపకార్థం ప్రతిజ్ఞ దినోత్సవాన్ని నిర్వహించారు. స్మార్ట్ మీటర్లను బిగించడం ద్వారా విద్యుత్ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు లాభం చేస్తూ అదే సమయంలో సామాన్యులపై అదనపు భారాలు వేస్తుందన్నారు.

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన నేతలు

    ఏలూరు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీత రామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ సూచనలతో విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను పార్టీ నూజివీడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో నూజివీడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌గా కుంపటి అరుణ, నరసింగపాలెం పీఎసీఎస్ చైర్మన్‌గా పొన్నం వెంకట రామచంద్రరావు(ఎర్రబాబు)ను పరిచయం చేశారు. సీనియర్ నాయకులు ఆశీస్సులు, శుభాకాంక్షలు అందించారు.