ఎన్టీఆర్: కంచికచర్ల మండలం కీసర వద్ద స్వర్ణ టోల్ ప్లాజా రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఈనెల 22న జరిగిన ప్రమాదంలో తల్లి, బాలుడు మృతి చెందడంతో భద్రతపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇక్కడ పలు ప్రమాదాలు సంభవించాయి. అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కూడా చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Locations: Krishna
-
రేపు నందిగామలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం
ఎన్టీఆర్: నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో రేపు ఉదయం 10:00 గంటలకు ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం జరుగనుంది. తంగిరాల సౌమ్య, అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.
-
జి.కొండూరు వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్
ఎన్టీఆర్: జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడు బ్రిడ్జి వద్ద రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులతో కలిసి వరద ఉధృతి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రవాహం లోలేవాల్ బ్రిడ్జిపై నుంచి వెళ్ళాడటంతో రాకపోకలు నిలిపివేశారు.
-
ఆకులమన్నాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కృష్ణా: పెడన నియోజకవర్గం గూడూరు మండలం ఆకులమన్నాడు పంచాయతీలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సూచనలతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ ఎండి రఫీ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికత ఉపయోగించి క్యూఆర్ కోడ్ ద్వారా పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాకీ నాని, బ్యాంకు ఛైర్మన్ శివాజీ, ప్రసాద్, వీఆర్వో ప్రసాద్, సచివాలయం సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
-
రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు విడుదల
ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన క్రీడా ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. రూ.4.9 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేయడం హర్షణీయమని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు.
-
ఉధృతంగా కట్టలేరు వాగు.. కొట్టుకుపోయిన రోడ్డు
ఎన్టీఆర్: తిరువూరు నియోజకవర్గంలో మరింత ఉధృతంగా కట్టలేరు వాగు ప్రవహిస్తోంది. గంపలగూడెం మండలంలోని వినగడప-తోటమూల మధ్య కిలోమీటరున్నర మేర రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజుల క్రితమే కొత్త రోడ్డు వేయగా.. రెండురోజులు మాత్రమే 24 గ్రామాల ప్రజలు ప్రయాణించారు. వినగడప నుంచి మధిర వైపు వెళ్లాలన్నా ఈ గ్రామం నుంచే రాకపోకలు సాగించాలి. మండలంలోని 24 గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
-
నందిగామలో భారీ వర్షం.. అస్తవ్యస్తంగా జనజీవనం
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు వర్షం కురిసి ఆగిపోవడంతో కాస్త ఊరట లభించిందని అనుకునేలోపే సాయంత్రం మళ్లీ భారీగా వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులపై వర్షపు నీరు నిలిచి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-
‘భారీ వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం’
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో రైతులు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ దేశానికి అన్నం అందిస్తున్నారు. కానీ, గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో పంటచేలు మునిగి, ప్రత్తి, పెసర పంటలు నీటిలో ఉండి ఊపిరాడక నష్టపోయాయి. రైతు వెన్నుముక విరిగినట్లైంది. వరదలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. కౌలు రైతులు నష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.
-
వరదలో చేపలతో పాటు విష సర్పాలు.. జాలర్లు జాగ్రత్త..!
ఎన్టీఆర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఎగువ నుంచి వరద నీరు రావడంతో కంచికచర్ల కంచలమ్మ చెరువు వద్ద వరద నీరు కలింగం ద్వారా రావడంతో చేపలు కొట్టుకొచ్చాయి. జాలర్లు వాటిని గాలం వేసి పట్టే సందర్భంలో గాలానికి చేపలు, విష సర్పాలు రావడంతో జాలరు గాలం ద్వారా విష సర్పాన్ని బయటికి జాగ్రత్తగా వదిలివేశాడు.
-
‘అమరావతిపై అబద్ధపు ప్రచారం’పై సెమినార్
ఎన్టీఆర్: విజయవాడ నగరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘అమరావతిపై అబద్ధపు ప్రచారం.. భావ ప్రకటనా స్వేచ్ఛ’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఆర్ మీడియా అకాడెమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్, జస్టిస్ సునీల్ చౌదరి, ప్రముఖ చరిత్రకారుడు సాయి, అమరావతి రైతులు పాల్గొన్నారు.