ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు వర్షం కురిసి ఆగిపోవడంతో కాస్త ఊరట లభించిందని అనుకునేలోపే సాయంత్రం మళ్లీ భారీగా వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులపై వర్షపు నీరు నిలిచి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Locations: Krishna
-
‘భారీ వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం’
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలో రైతులు భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ దేశానికి అన్నం అందిస్తున్నారు. కానీ, గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో పంటచేలు మునిగి, ప్రత్తి, పెసర పంటలు నీటిలో ఉండి ఊపిరాడక నష్టపోయాయి. రైతు వెన్నుముక విరిగినట్లైంది. వరదలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. కౌలు రైతులు నష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు.
-
వరదలో చేపలతో పాటు విష సర్పాలు.. జాలర్లు జాగ్రత్త..!
ఎన్టీఆర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఎగువ నుంచి వరద నీరు రావడంతో కంచికచర్ల కంచలమ్మ చెరువు వద్ద వరద నీరు కలింగం ద్వారా రావడంతో చేపలు కొట్టుకొచ్చాయి. జాలర్లు వాటిని గాలం వేసి పట్టే సందర్భంలో గాలానికి చేపలు, విష సర్పాలు రావడంతో జాలరు గాలం ద్వారా విష సర్పాన్ని బయటికి జాగ్రత్తగా వదిలివేశాడు.
-
‘అమరావతిపై అబద్ధపు ప్రచారం’పై సెమినార్
ఎన్టీఆర్: విజయవాడ నగరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘అమరావతిపై అబద్ధపు ప్రచారం.. భావ ప్రకటనా స్వేచ్ఛ’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఆర్ మీడియా అకాడెమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్, జస్టిస్ సునీల్ చౌదరి, ప్రముఖ చరిత్రకారుడు సాయి, అమరావతి రైతులు పాల్గొన్నారు.
-
‘అమరావతిపై ఎందుకు బురదజల్లుతున్నారు?’
ఎన్టీఆర్: విజయవాడలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ‘అమరావతిపై అబద్ధపు ప్రచారం.. భావ ప్రకటనా స్వేచ్ఛ’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ మాట్లాడుతూ రాజధాని నిర్మిస్తున్నారంటే అందరూ ముందుకొచ్చి ప్రోత్సహిస్తారని.. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారన్నారు. అమరావతిపై ఎందుకు బురదజల్లడమని ప్రశ్నించారు.
-
విలేజ్‌లో విష జ్వరాలు.. కారణం?
కృష్ణా: ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామం దూసరపాలెంలో విష జ్వరాలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గ్రామంలో డ్రైనేజీలు లేకపోవడంతో చిన్నపాటి వర్షం కురిసిన నీరు రోడ్లపైనే నిలిచిపోతాయని స్థానికులు చెబుతున్నారు. వాటిలో దోమలు చేరి వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయని వాపోయారు. పదుల సంఖ్యలో డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నట్లు చెప్పారు. అధికారులు తక్షణమే స్పందించి నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలని కోరారు.
-
చినుకు పడితే చిత్తడే..!
ఏలూరు: ముసురు మండలం రమణక్కపేట గ్రామంలో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక వర్షాల్లో రోడ్లు చిత్తడిగా మారి నీరు ఇంట్లోకి చేరుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. హైస్కూల్ వరకు పిల్లలు వెళ్లలేకపోతున్నారు. దళితవాడ, కుమ్మరపేటలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. నిధులు లేక పనులు చేయలేకపోతున్నామని, మంత్రి నిధులు విడుదల చేస్తే చేస్తామని సర్పంచ్ ధనలక్ష్మి గాంధీ చెబుతున్నారని మంత్రి పార్థసారధిని వేడుకున్నారు.
-
నూజివీడులో సబ్ కలెక్టర్ విస్తృత పర్యటన
ఏలూరు: నూజివీడు పట్టణ పరిధిలోని హనుమాన్ జంక్షన్ రోడ్డులో గల మొగళ్ళ చెరువు ప్రాంతంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న గురువారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలలో అధిక వర్షాలకు రోడ్లపై నీరు నిలవడం, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమస్య పరిష్కారం కోసం సబ్ కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. డ్రైనేజీలకు అడ్డుపడిన సిల్ట్ తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షపునీరు ముందుకు ప్రవహించేలా చూడాలన్నారు.
-
కృష్ణా నది వరద ఉధృతి.. అప్రమత్తం చేసిన కలెక్టర్
కృష్ణా నది వరద ఉధృతితో నదీపరివాహక ప్రాంత ప్రజలను కలెక్టర్ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.26 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తోట్లవల్లూరులో SDRF టీమ్ సిద్ధం చేశామని, బుడమేర ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
-
ఆ గ్రామంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిన కోత..!
కృష్ణా: నది వరదల ఉద్ధృతితో ఎడ్లంక గ్రామంలో కోత ప్రమాదకర స్థాయిలో పెరిగింది. హోమంత్రి అనిత, టీడీపీ నేత బొబ్బా గోవర్ధన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ప్రకాశ్ జైన్‌లను కలిసి సమస్యను వివరించారు. హోమంత్రి తక్షణ స్పందనతో జిల్లా యంత్రాంగం గ్రామ పరిస్థితుల అధ్యయనం ప్రారంభించింది. కోత నివారణపై చర్చించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ఈ సాయంత్రం ఎడ్లంకను సందర్శించనున్నారు.