ఎన్టీఆర్: నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద ఉన్న వైరా కట్టలేరు వాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ తెలంగాణ రాష్ట్రంతో పాటు గత రెండు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు వరద పోటెత్తిందని స్థానికులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీరులపాడు-నందిగామ రెండు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Locations: Krishna
-
రాష్ట్రంలో వినాశనానికి ఇదే కారణం: MLA
కృష్ణా: అవగాహన రాహిత్యంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన వినాశనాన్ని అందరం చూశామని.. అవగాహనతో కూడిన పాలన చేస్తే జరిగే మంచిని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై హర్షం వ్యక్తం చేస్తూ.. గుడివాడ ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాము మీడియా ద్వారా తన స్పందన తెలిపారు.
-
ఏనుగు గడ్డ వాగుకు వరద ఉద్ధృతి.. రాకపోకలు బంద్
ఎన్టీఆర్: వీరులపాడు మండలం పెద్దాపురంలోని ఏనుగు గడ్డ వాగుకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో పెద్దాపురం-గూడెంమాధవరం రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏనుగు వాగు పరిసర ప్రాంతాల్లోని మొక్కజొన్న, పత్తి పంట ముంపునకు గురైందని రైతులు అన్నారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయని స్థానికులు వాపోయారు.
-
PACS అధ్యక్షులుగా గుత్తా
ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణం ప్రాథమిక సహకార సంఘం (PACS) అధ్యక్షులుగా గుత్తా వీరవెంకటరత్నం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
-
ఆ లక్ష్యంతోనే శిబిరాలు నిర్వహిస్తున్నాం: మాదాల
కృష్ణా: గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ఆర్‌సీయం పాఠశాలలో లయన్స్‌క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఉయ్యూరు రోటరీ ఐ సెంటర్ వైద్యులు విద్యార్థులకు చికిత్సలు అందించారు. గుడివాడ పట్టణం ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 10 చదువుతున్న 5వేల మంది చిన్నారులకు నేత్ర పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు మాదాల సురేష్ అన్నారు.
-
వర్షాలకు ఇబ్బంది లేకుండా చర్యలు : కలెక్టర్
ఎన్టీఆర్: విజయవాడలో వర్షాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మునేరుకు 25వేల క్యూసెక్కుల వరద వస్తేనే ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నారు. కలెక్టరేట్‌లో 9154970454 నంబరులో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.
-
మూడోసారి PACS అధ్యక్షులుగా నెమలిపురి
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం నక్కలంపేట గ్రామ ప్రాథమిక సహకార సంఘం(PACS) అధ్యక్షులుగా నెమలిపురి అమ్మరావు (గాంధీ) నియమితులయ్యారు. ఈయన వరుసగా మూడోసారి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా నియమితులైనట్లు తెలిపారు.
-
కొండపల్లి మున్సిపాలిటీ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా మోస్మి
ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన ట్రైనింగ్ క్లాస్‌లకి వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న మోస్మి గనియాను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియామిస్తూ గురువారం అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఏఈ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, కొండపల్లి మున్సిపాలిటీ పాలన గాడిలో పడేందుకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు సూచనలతో కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
వినాయకచవితి వేడుకల్లో పాల్గొన్న కోగంటి
ఎన్టీఆర్: కంచికచర్ల పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ రోడ్డులో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కంచికచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్, మండల టీడీపీ అధ్యక్షులు కోగంటి బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అర్చకులు, కాకాని సుమన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
-
బుడమేరుపై వదంతులు నమ్మొద్దు : కలెక్టర్
ఎన్టీఆర్: బుడమేరు వరదపై కలెక్టర్ లక్ష్మీశా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరు పొంగిపొర్లుతుందని కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వరంగల్, ఖమ్మంలో వర్షాలు పడితే ఆనీరు మునేరు వైపు వెళ్తుందని.. తిరువూరు నియోజకవర్గంలో పడిన వర్షం బుడమేరు వైపునకు వస్తుందన్నారు. బుడమేరులో 3వేల క్యూసెక్కులు వరద ప్రవాహం ఉందన్నారు. వదంతులు నమ్మొద్దన్నారు.