కృష్ణాజిల్లాలోని నాగాయలంకలో ఒక బీసీ రైతుపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. డబ్బు తిరిగి ఇచ్చేసినా తనను పంచాయతీకి పిలిచి దాడి చేశారని బాధితుడు వెంకటేష్ ఆరోపించాడు. కులం పేరుతో దూషిస్తూ కాళ్లతో తన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో గాయపడిన వెంకటేష్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Locations: Krishna
-
పేలుడు ఘటనలో బాధితుడు మృతి..!
ఎన్టీఆర్: ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో రెండు రోజుల క్రితం జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపి అనే వ్యక్తి శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. చందర్లపాడు మండలం కూనయపాలెం గ్రామానికి చెందిన గోపి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
‘విద్యార్థుల భవితకు టీచర్స్ దిశా నిర్దేశకులు’
కృష్ణా: అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వంతెన సెంటరులో ఉన్న కృష్ణారావు విగ్రహానికి విశ్రాంత ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు దిశా నిర్దేశకులని ఈ సందర్భంగా వక్తలు అన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులను నాయకులు సత్కరించారు.
-
దేవాలయాల అభివృద్ధికి కృషి: MLA
కృష్ణా: గుడివాడలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఘంటసాల నాగభూషణం సత్రం, వేణుగోపాల దేవస్థానం కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేవాలయాల వైభవాన్ని పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని కొత్త కమిటీ సభ్యులు అరవింద్, సతీష్‌లను కోరారు. రానున్న వినాయక చవితి, దసరా ఉత్సవాలను ఘనంగా జరపాలని ఆయన సూచించారు.
-
ఆరేళ్ల కష్టాలు తొలగిన క్షణం
కృష్ణా: ఘంటసాల మండలం పూషడం గ్రామ ప్రజలకు రహదారి కష్టాలు తొలగనున్నాయి. గత ఆరేళ్లుగా అధ్వానంగా మారిన గ్రామీణ రహదారిని పునరుద్ధరించేందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషి ఫలించింది. రూ.1.40కోట్లతో రహదారి నిర్మాణానికి నెల రోజుల క్రితం శంకుస్థాపన జరిగింది. శుక్రవారం గ్రామ సర్పంచ్ రహదారి పనులను ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
-
చల్లపల్లిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
కృష్ణా: భారతదేశ మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని చల్లపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ చిత్రపటానికి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, ఈఓ పీవీ.మాధవేంద్రరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్ సూర్యప్రసాద్, పైడిపాముల రాజేంద్ర, హరి తదితరులు పాల్గొన్నారు.
-
వారి స్థాయి సమున్నతం.. పాత్ర మహోన్నతం
కృష్ణా: సమాజంలో ఉపాధ్యాయుని స్థాయి సమున్నతమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని అటల్ బిహారి వాజ్‌పాయ్ విజ్ఞాన కేంద్రం రామమోహన్ గ్రంథాలయంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం, మండలి వెంకటకృష్ణారావు శతజయంతి కమిటీ, రామమోహన గ్రంథాలయం ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు, గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మహోన్నతమన్నారు.
-
సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు స్మరించుకుంటూ..!
ఎన్టీఆర్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.
-
‘ఛలో విజయవాడ’కు తరలిరండి: SFI
తిరుపతి: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగం సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 6వ తేదీన ఛలో విజయవాడకు వేలాది మంది విద్యార్థులు తరలిరావాలని చంద్రగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్స్ విడుదల చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు తేజ మాట్లాడుతూ.. పెండింగ్‌లో రూ.6400 కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర అవస్థలుపడుతున్నారని తెలిపారు.
-
రైతుల కష్టాలు.. యూరియా కోసం బారులు
ఎన్టీఆర్: పెనుగంచిప్రోలు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచి క్యూలు కట్టారు. అధికారులు ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్ని రోజులో ఈ యూరియా కష్టాలంటూ రైతులు వాపోతున్నారు.